Victrina: పెళ్లికి ముందే పంజాబీ నేర్చుకుంది.. ఆ మూడు రోజులు ఒక ముక్క కూడా ఇంగ్లిష్‌ మాట్లాడలేదు.. క్యాట్‌ గురించి విక్కీ కజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజస్థాన్‌లోని ఓ గ్రాండ్‌ హోటల్‌లో వివాహం చేసుకున్న కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ దంపతులు నిన్న ముంబయిలో అడుగుపెట్టారు

Victrina: పెళ్లికి ముందే పంజాబీ నేర్చుకుంది.. ఆ మూడు రోజులు ఒక ముక్క కూడా ఇంగ్లిష్‌ మాట్లాడలేదు.. క్యాట్‌ గురించి విక్కీ కజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 9:49 AM

రాజస్థాన్‌లోని ఓ గ్రాండ్‌ హోటల్‌లో వివాహం చేసుకున్న కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ దంపతులు నిన్న ముంబయిలో అడుగుపెట్టారు. పెళ్లికి ముందు వరకు తమ ప్రేమబంధంపై ఎంతో గోప్యత పాటించిన ఈ నవ దంపతులు ముంబయి ఎయిర్‌ పోర్టులో ఒకరిచేయి మరొకరు పట్టుకుని మరీ కెమెరాలకు స్టిల్స్ ఇచ్చారు. తమకు స్వాగతం చెప్పడానికి వారిని, మీడియా ప్రతినిధులను ఆత్మీయంగా పలకరించారు. కాగా హాంకాంగ్‌లో పుట్టిన కత్రినా కైఫ్‌ లండన్‌లో పెరిగింది. కాబట్టి ఆమె మదర్ టంగ్ ఇంగ్లిష్‌ అని చెప్పవచ్చు. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక హిందీని కూడా ఒంటపట్టించుకుంది. మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో చాలా వరకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే మాట్లాడింది. అయితే ఈ రెండింటితో పాటు మరొక భాషను కూడా క్యాట్ నేర్చుకుందట. అదే పంజాబీ.

కత్రినాతో జీవితం పంచుకున్న విక్కీ కౌశల్‌ది పంజాబే. అందుకే అత్తింట్లోకి అడుగుపెట్టే ముందే పంజాబీ భాషను బాగా ఒంట బట్టించుకుందట కత్రినా. విక్కీ కుటుంబ సభ్యులతో ఆమె బాగా కలిసిపోయేందుకు ఇది కూడా ఒక కారణమట. తాజాగా విక్కీ కౌశల్‌ కజిన్‌ ఉపాసన వోహ్రా ఈ విషయంపై స్పందిస్తూ ‘ క్యాట్‌ ముందుగానే పంజాబీ బాహుగా మారిపోయింది. ఆమె ఇప్పుడు స్వచ్ఛమైన పంజాబీ భాష మాట్లాడగలదు. ఈక్రమంలోనే తనతో మాకు బాగా చనువు ఏర్పడింది. ఇక పెళ్లి వేడుకల్లో విక్కీతో పాటు మా కుటుంబ సభ్యులందరితో కత్రినా ఒక ముక్క కూడా ఇంగ్లిష్‌ మాట్లాడలేదు. అంతా పంజాబీలోనే. ఇప్పుడు మేమంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం’ అంటూ ఇన్‌స్టాలైవ్‌లో చెప్పుకొచ్చింది. కాగా పెళ్లికి రాని అతిథుల కోసం ముంబయిలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటుచేసేందుకు విక్ట్రీనా దంపతులు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

Also Read:

Viral Photo: ఎవరైనా గుర్తించారా ఈ నడిచే నక్షత్రాన్ని.. చిన్నారి ఎదురుగా ఉన్న స్టార్ ఎవరో కనిపెట్టండి..?

Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ దాడి.. విజయ్‌ సేతుపతికి చెన్నై కోర్టు సమన్లు..

Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)