AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రారా సామి అంటూ ఆఫ్‌ స్ర్కీన్‌లో రష్మిక స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

ప్రస్తుతం టాలీవుడ్‌లో 'పుష్ప' మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే సందడి చేస్తున్నాయి. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

Rashmika Mandanna: రారా సామి అంటూ ఆఫ్‌ స్ర్కీన్‌లో రష్మిక స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Basha Shek
| Edited By: |

Updated on: Dec 16, 2021 | 12:44 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే సందడి చేస్తున్నాయి. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్పరాజ్‌’గా కనిపించనున్నాడు. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన సందడి చేయనుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న పాటలు యూట్యూట్‌లో రికార్డులు నమోదుచేస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

కాగా ఈసినిమాలోని ‘రారాసామి’ అనే పాట సంగీతాభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో చాలామంది ఈ పాటను రీక్రియేట్‌, స్ఫూప్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్‌లో అద్భుతమైన హావభావాలతో ఆకట్టుకున్న రష్మిక మరోసారి ఈ సాంగ్‌ను రీక్రియేట్‌ చేసింది. అయితే ఆన్‌స్ర్కీన్‌లో కాకుండా ఆఫ్‌స్ర్కీన్‌లో ఈ పాటకు స్టెప్పులేసింది. అనంతరం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘చాలా మంది ఈ స్టెప్ వేయడం నేను గమనించాను. అందుకే నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. నేను కూడా ఈ స్టెప్ వేసి పార్టీలో చేరుతున్నాను. ఈ స్టెప్ వేసి ఇంకా ఎందరో ఈ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చింది. రష్మిక పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Samantha: స్టైలిష్ లుక్ లో క్రేజీ ఫోజులు.. తగ్గేదే లే అంటున్న సమంత

Ajith: వలిమై సినిమాలో అజిత్‌ బైక్‌ స్టంట్స్‌ చూశారా.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Tiger Shroff: ఎముకలు కొరికే చలిలో షర్ట్‌ లేకుండా పరిగెత్తిన యాక్షన్‌ హీరో.. వైరల్‌గా మారిన వీడియో..

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!