AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Shroff: ఎముకలు కొరికే చలిలో షర్ట్‌ లేకుండా పరిగెత్తిన యాక్షన్‌ హీరో.. వైరల్‌గా మారిన వీడియో..

జాకీష్రాఫ్‌ తనయుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు టైగర్‌ ష్రాఫ్‌. ఆ తర్వాత తనదైన నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు

Tiger Shroff: ఎముకలు కొరికే చలిలో షర్ట్‌ లేకుండా పరిగెత్తిన యాక్షన్‌ హీరో.. వైరల్‌గా మారిన వీడియో..
Basha Shek
|

Updated on: Dec 14, 2021 | 8:45 PM

Share

జాకీష్రాఫ్‌ తనయుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు టైగర్‌ ష్రాఫ్‌. ఆ తర్వాత తనదైన నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘హీరో పంతీ’, ‘భాఘీ’ సిరీస్‌, ‘వార్‌’ సినిమాల్లో టైగర్‌ చేసిన ఫైట్లు, డ్యాన్సులకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ‘వార్‌’ సినిమాలో హృతిక్‌కు ధీటుగా అతను చేసిన స్టంట్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో ఫిట్‌గా ఉంటాడు టైగర్‌. ఇందుకోసం కఠిన వర్కవుట్లు, ఎక్సర్‌సైజులు చేస్తుంటాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో టైగర్‌ పోస్ట్‌ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

టైగర్‌ ప్రస్తుతం ‘గణ్‌పత్‌’ అనే యాక్షన్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది. అక్కడ ప్రస్తుతం ఎముకలు కొరికే చలి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంతటి చల్లటి వాతావరణంలో కూడా చొక్కా తీసేసి కేవలం షార్ట్స్‌ ధరించి పరిగెత్తుతున్నాడీ యాక్షన్‌ హీరో. అనంతరం ‘ మైనస్‌ 1 డిగ్రీ చలిలో ఇలా రోజును ప్రారంభిస్తున్నాను’ అంటూ తన జాగింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. టైగర్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న దిషా పటానీ ఈ వీడియోను చూసి ‘లోల్‌’ అని కామెంట్‌ పెట్టగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘వావ్‌.. అంత చలిలో ఎలా?’ అంటూ స్పందించింది. ‘సూపర్బ్‌..ఇది వేరే లెవెల్‌’ అంటూ మరికొందరు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Shyam Singha Roy Trailer: శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన నాని..

Victrina: ముంబయి చేరుకున్న విక్ట్రీనా దంపతులు.. తొలిసారి బయట జంటగా కనిపించి సందడి..

నిన్న యాక్టర్‌గా ఎంట్రీ.. నేడు డాక్టర్‌గా డిగ్రీ పట్టా.. వైరలవుతోన్న శంకర్‌ కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే ఫొటోలు..