Victrina: ముంబయి చేరుకున్న విక్ట్రీనా దంపతులు.. తొలిసారి బయట జంటగా కనిపించి సందడి..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరా హాటల్‌ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది.

Victrina: ముంబయి చేరుకున్న విక్ట్రీనా దంపతులు.. తొలిసారి బయట జంటగా కనిపించి సందడి..
Follow us

|

Updated on: Dec 14, 2021 | 8:19 PM

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరా హాటల్‌ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇప్పటివరకు తమ ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై కత్రినా, విక్కీ కానీ ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. అయితే మొదటిసారి జంటగా కనిపించారీ నూతన వధూవరులు. వివాహ వేడుక అనంతరం ఈరోజు (డిసెంబర్‌14) ముంబయి చేరుకున్న విక్ట్రీనా జోడి ..అక్కడి విమానాశ్రయంలో జంటగా ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ సందర్భంగా కత్రినా చుడీదార్‌ ధరించి నుదట తిలకంతో, విక్కీ ఫార్మల్‌ లుక్‌లో కనిపించారు. ఇద్దరూ ఒకరిచేయి మరొకరు పట్టుకుని తమకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వారిని, మీడియా ప్రతినిధులను ఆత్మీయంగా పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న విక్ర్టీనా తమ రిలేషన్‌షిప్‌ గురించి ఎప్పుడూ అధికారికంగా మాట్లాడలేదు. జంటగా కూడా ఎక్కడా కనిపించలేదు. పెళ్లి వరకు అదే గోప్యత పాటించారు. ఈ నేపథ్యంలో మొదటిసారి ఒకరి చేయి మరొకరు పట్టుకుని భార్యాభర్తలు కనిపించడంతో ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు.

Also Read:

Ketika Sharma: కేతిక శర్మ లేటెస్ట్ “రొమాంటిక్” పిక్స్..

నిన్న యాక్టర్‌గా ఎంట్రీ.. నేడు డాక్టర్‌గా డిగ్రీ పట్టా.. వైరలవుతోన్న శంకర్‌ కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే ఫొటోలు..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ వేదికపై బాలీవుడ్ స్టార్స్.. ఫినాలేలో సందడి చేయనున్న దీపికా.. అలియా..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి