AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్న యాక్టర్‌గా ఎంట్రీ.. నేడు డాక్టర్‌గా డిగ్రీ పట్టా.. వైరలవుతోన్న శంకర్‌ కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే ఫొటోలు..

సాధారణంగా డాక్టర్‌ కాబోయి యాక్టరయ్యామని సినీతారలు చెబుతుంటారు. అయితే ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితీ శంకర్‌ మాత్రం ముందు నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్‌గా మారింది

నిన్న యాక్టర్‌గా ఎంట్రీ.. నేడు డాక్టర్‌గా డిగ్రీ పట్టా.. వైరలవుతోన్న శంకర్‌ కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే ఫొటోలు..
Basha Shek
|

Updated on: Dec 14, 2021 | 7:35 PM

Share

సాధారణంగా డాక్టర్‌ కాబోయి యాక్టరయ్యామని సినీతారలు చెబుతుంటారు. అయితే ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితీ శంకర్‌ మాత్రం ముందు నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్‌గా మారింది. ఇటీవలే కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ఎంబీబీఎస్‌ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చెన్నై నగరంలోని ఓ ప్రముఖ డీమ్డ్‌ యూనివర్శిటీలో వైద్య కోర్సును పూర్తి చేసిన అదితీ తాజాగా జరిగిన వర్సిటీ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో డిగ్రీ సర్టిఫికెట్‌ను అందుకుంది. తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా ఆమె ఈ ఎంబీబీఎస్‌ పట్టాను అందుకుంది. కాగా ఈ కార్యక్రమానికి అదితి తండ్రి డైరెక్టర్‌ శంకర్‌, తల్లి ఈశ్వరి, సోదరుడు అర్జిత్‌ శంకర్‌ తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తన గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయింది అదితి. ‘లేట్‌ నైట్స్‌, కాఫీ కప్పులు.. ఇలా ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నేను ఇప్పుడు అధికారికంగా డాక్టర్‌నయ్యాను’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. దీంతో పలువురు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలావుంటే, అదితి శంకర్‌ ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ‘విరుమన్‌’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె వెండితెరకు పరిచయమవుతోంది. సూర్య- జ్యోతిక దంపతులు సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. 2022లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమానే ఎక్కువగా చూశారు !! వీడియో

Pushpa Exclusive Interview: పుష్ప టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో

Naga Chaitanya: ‘నా ఫ్యామిలీపై ఎఫెక్ట్ పడేది ఎలాంటిదైనా చేయను’ చై వీడియో వైరల్.. సామ్‌ను ఉద్దేశించేనా?