Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JanaSena: తిరుపతిలో జనసేన నేతలపై కేసు.. ఫ్లేక్సీలు చింపడంపై పోలీసులు సీరియస్..

Case against Janasena leaders: జనసేన నేతలపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న జనసేన నేతలు.. బ్యానర్లను

JanaSena: తిరుపతిలో జనసేన నేతలపై కేసు.. ఫ్లేక్సీలు చింపడంపై పోలీసులు సీరియస్..
Janasena Party
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 14, 2021 | 7:43 PM

Case against Janasena leaders: జనసేన నేతలపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న జనసేన నేతలు.. బ్యానర్లను చింపివేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ప్రజలు ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపి వేశారని తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా జనసేన నేతలు వ్యవహరించారని పోలీస్ ప్రొసీడింగ్స్ ఎస్సై నాగేంద్ర బాబు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్, సుభాషిని, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, బాబ్జి, ఆనంద్, కృష్ణ, రాందాస్ చౌదరిలతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐపీసీ 427, 188, 341, 270, 271, 143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నాగేంద్ర బాబు తెలిపారు.

అమ‌రావ‌తి రైతుల పాదయాత్ర ఈ రోజు ముగిసింది. అయితే.. తిరుప‌తి న‌గ‌రంలో అమ‌రావ‌తి రైతులు న‌డుచుకుంటూ అలిపిరికి ప్రయాణమైన క్రమంలో.. వారి పాదయాత్రను స్వాగ‌తిస్తూనే రాయ‌ల‌సీమ ఆకాంక్షలను గౌరవించాలంటూ తిరుపతిలోని కొందరు ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. తమకు 3 రాజధానులే కావాలని.. అమ‌రావ‌తి పెద్దలారా ఆలోచించండి.. అంటూ కొందరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. జనసేన కార్యకర్తలు, నేతలు వాటిని చింపినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Benefits Of Clay Pots: మట్టి కుండల్లో వండిన ఆహారంలో ఎన్నో పోషకాలు.. దాని వెనుకున్న అసలు నిజం తెలిస్తే షాకే..

Health Tips: స్నానం చేసే ముందు నీటిలో వేపాకు వేసుకుంటే ఎన్నో లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు..

సల్మాన్‌కు బిగ్ షాక్.. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్ లో సికిందర్
సల్మాన్‌కు బిగ్ షాక్.. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్ లో సికిందర్
రంగుల దుస్తుల్లో రంగమ్మత్త.. అనసూయ అందాలు చూస్తే అసూయపుట్టదా!
రంగుల దుస్తుల్లో రంగమ్మత్త.. అనసూయ అందాలు చూస్తే అసూయపుట్టదా!
అబ్బా ఏం అందంరా బాబు.. సూటు,బూటులో దిశా పటాని గ్లామర్ ట్రీట్!
అబ్బా ఏం అందంరా బాబు.. సూటు,బూటులో దిశా పటాని గ్లామర్ ట్రీట్!
ప్రతి తొక్కకి ఒకరోజు వస్తుందంటే ఇదే..పడేశారో ఆస్తులన్నీఅమ్మకానికే
ప్రతి తొక్కకి ఒకరోజు వస్తుందంటే ఇదే..పడేశారో ఆస్తులన్నీఅమ్మకానికే
ఉచిత టికెట్ల గొడవ.. SRH, HCA మధ్య రగులుతున్న చిచ్చు!
ఉచిత టికెట్ల గొడవ.. SRH, HCA మధ్య రగులుతున్న చిచ్చు!
హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
చెమట వాసన వదలడంలేదా.. ఇలా చేసి చూడండి
చెమట వాసన వదలడంలేదా.. ఇలా చేసి చూడండి
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పిల్ కొట్టేసిన న్యాయస్థానం..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పిల్ కొట్టేసిన న్యాయస్థానం..