Benefits Of Clay Pots: మట్టి కుండల్లో వండిన ఆహారంలో ఎన్నో పోషకాలు.. దాని వెనుకున్న అసలు నిజం తెలిస్తే షాకే..

Clay Pots Benefits: ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పలు రకాల పద్దతులను, ఆహార నియమాలను

Benefits Of Clay Pots: మట్టి కుండల్లో వండిన ఆహారంలో ఎన్నో పోషకాలు.. దాని వెనుకున్న అసలు నిజం తెలిస్తే షాకే..
Clay Pots Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 14, 2021 | 7:18 PM

Clay Pots Benefits: ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పలు రకాల పద్దతులను, ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో చాలామంది ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం వైపు మళ్లుతున్నారు. దీనిలో భాగంగా శరీరానికి ప్రత్యక్షంగా మేలు చేసే పద్దతులను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే కుండల వినియోగం కూడా పెరుగుతోంది. అయితే.. మట్టి కుండలలో వండిన ఆహారం తినడం వల్ల, అందులో ఆహారాన్ని ఉంచడం వల్ల కలిగే లాభాలు.. ముఖ్యంగా వీటి గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మట్టి కుండల్లో ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పరంగా మంచిదే.. అయితే.. మట్టి కుండలలో ఆహారాన్ని వండడం వల్ల, అందులో ఆహారాన్ని ఉంచడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి.. సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

ఉదరానికి మేలు.. ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. మట్టి కుండలలో ఆహారాన్ని ఉంచడం ద్వారా భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి. అయితే ఇతర గాజు, ఇనుము లేదా అల్యూమినియం పాత్రలు అటువంటి ప్రయోజనాలను అందించవు. మట్టిలో తయారుచేసి ఉంచిన ఆహారం ముఖ్యంగా కడుపుకు మేలు చేస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

కొవ్వు తగ్గుతుంది.. మట్టి కుండలు కొలెస్ట్రాల్‌ను కొంతమేర తగ్గించడంలో సహాయపడతాయి. ఎక్కువ నూనె ఉన్న ఆహారాన్ని మట్టి పాత్రలో ఉంచినప్పుడు, అది కొంతవరకు నూనెను పీల్చుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కొంతవరకు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అంతే కాకుండా మట్టి కుండలలో వండిన ఆహారానికి ప్రత్యేక వాసన, రుచి ఉంటుంది.

శరీరానికి పోషకాలు.. ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి కుండల్లోనే వంట చేయడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. వాటిలో చాలా రకాల సూక్ష్మపోషకాలు కనిపిస్తాయి. ఇవి ఆహారం సహాయంతో నేరుగా శరీరానికి చేరుతాయి. ప్రెషర్ కుక్కర్‌లో తయారు చేసిన ఆహారంలో ఈ మూలకాలు ఉండవు. కాబట్టి కుండలను మీ వంటగదిలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు.

ఇలా శుభ్రం చేయాలి.. మీరు మట్టి కుండలను ఉపయోగించాలనుకుంటే వాటిని 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసి ఆ తర్వాతే వాడాలి. దీనివల్ల ఆహారంలో వాడే నూనె, నీటిని పాత్రలు వెంటనే పీల్చుకోవు. సబ్బుతో కడగడానికి ఎప్పుడూ ఉపయోగించవద్దు. అటువంటి పాత్రలను శుభ్రం చేయడానికి వేడి నీటిని ఉపయోగించడం మంచిదని పేర్కొంటున్నారు.

Also Read:

పాలు, పండ్ల రసాలతో కలిపి మందులు తీసుకోకూడదట.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వాటితో కలిపి నిమ్మకాయను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..