AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, పండ్ల రసాలతో కలిపి మందులు తీసుకోకూడదట.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Knowledge news: పాలల్లో క్యాల్షియంతో పాటు పలు ఆరోగ్యపోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యనిపుణులు పాలను సంపూర్ణ ఆహారంగా పేర్కొంటారు.ఇక తరచుగా పండ్ల రసాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు సూచిస్తుంటారు.

పాలు, పండ్ల రసాలతో కలిపి మందులు  తీసుకోకూడదట.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Basha Shek
|

Updated on: Dec 14, 2021 | 6:31 PM

Share

Knowledge news: పాలల్లో క్యాల్షియంతో పాటు పలు ఆరోగ్యపోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యనిపుణులు పాలను సంపూర్ణ ఆహారంగా పేర్కొంటారు.ఇక తరచుగా పండ్ల రసాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు సూచిస్తుంటారు. ఇందులో భాగంగానే మందులు, ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు పాలు, పండ్ల రసాలతో కలిపి తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని సైన్స్‌తో పాటు వైద్య నిపుణుల సూచిస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు.ఇంకా కొన్ని మందులు, ట్యాబ్లెట్లపై ఎర్రటి గీతలు కూడా ఉంటాయి. మరి వీటికి గల కారణాలను తెలుసుకుందాం రండి.

రక్తంలో కలవకుండా.. పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. కానీ మందులు, ట్యాబ్లెట్లు వేసుకునే ముందు, తర్వాత కానీ పాలను తీసుకోకూడదట. ఇలా తీసుకోవడం వల్ల పాలలోని క్యాల్షియం ఔషధాలను రక్తంలో కలవకుండా అడ్డుపడుతుందట. అందుకే పాల బదులు స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల రసాలతో కలిపి మెడిసిన్స్‌ను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఔషధాలు రక్తంలో కరిగేందుకు సహాయపడే ఎంజైమ్‌లను ఫ్రూట్‌ జ్యూస్‌లు నిరోధిస్తాయి. ఫలితంగా శరీరంపై ఔషధాల ప్రభావం తక్కువగా ఉంటుంది లేకపోతే మందులు ఆలస్యంగా ప్రభావం చూపిస్తాయి. ఇక ఖాళీ కడుపుతో మందులు అసలు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేస్తే కడుపులో మంట తదితర అనారోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉందంటున్నారు.

ఎర్రటి గీతలు ఎందుకు ఉంటాయంటే.. మనం తీసుకునే మందులపై అప్పుడప్పుడు ఎర్రటి గీతలు కనిపిస్తుంటాయి. డాక్టర్ల సలహాలు లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను అసలు కొనుగోలు చేయకూడదనే నిబంధనలను ఈ రెడ్‌లైన్స్‌ సూచిస్తాయి. సాధారణంగా యాంటీ బయాటిక్‌ మెడిసిన్స్‌పై ఈ ఎర్రటి గీతలు ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టానుసారంగా ఈ మందులు ఉపయోగించకూడదు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది.

Also Read:

Top 9 News: టోర్నడో దెబ్బకి విలవిలాడిన అమెరికా | మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్క !! వీడియో

Success Story: ఒక్క మహిళ.. వెయ్యిరూపాయల పెట్టుబడి.. ఏడేళ్ళు.. కోట్లాది రూపాయల సంపాదన.. ఎలా అంటారా..ఇదిగో ఇలా..!

Megastar Chiranjeevi: మెగా ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. డీవీవీ బ్యానర్ పై చిరంజీవి కొత్త ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌