Megastar Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. డీవీవీ బ్యానర్ పై చిరంజీవి కొత్త ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు వరుస
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ పుల్ జోష్ మీదున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. మరోవైపు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేశారు చిరంజీవి. ఇందులో కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా చిరంజీవి.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వెంకి కుడుముల దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ముందు నుంచి వినిపిస్తున్నట్టుగానే.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించబోయే చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
ట్వీట్..
Extremely delighted to announce a film with Megastar @KChiruTweets garu under the direction of Successful Director @VenkyKudumula. It’s a dream come true for us. Co Produced by Dr. Madhavi Raju. Rolling soon… #MegaStarWithMegaFan pic.twitter.com/QyvWAzotss
— DVV Entertainment (@DVVMovies) December 14, 2021
ప్రస్తుతం చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే భోళా శంకర్ సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక్క డిసెంబర్ నెలలోనే చిరు నటిస్తోన్న నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై హైకోర్టు కీలక ఆదేశాలు..