Bheemla Nayak: రానా బర్త్ డే సర్‌ప్రైజ్.. ఆకట్టుకుంటోన్న డేనియల్ శేఖర్ ఇంటెన్స్ గ్లింప్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న సినిమా 'భీమ్లానాయక్'. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకు రీమేక్‌గా సాగర్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న సినిమా ‘భీమ్లానాయక్’. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా సాగర్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో డేనియల్ శేఖర్ అనే పాత్రలో పవన్‌కు పోటీగా నటిస్తున్నాడు రానా. ఈ క్రమంలో దగ్గుబాటి హీరో పుట్టిన రోజు (డిసెంబర్14) ను పురస్కరించుకుని తాజాగా మరో అప్డేడ్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే టు రేజింగ్ డేనియర్ శేఖర్’ అంటూ సినిమాలో రానా పాత్రకు సంబంధించిన ఓ టీజర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ‘వాడు అరిస్తే భయపడతావా.. వాడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. ఆఫ్ట్రాల్ ఎస్ ఐ’ అంటూ ఆవేశంగా రానా మాట్లాడడం ఈ టీజర్‌లో మనం చూడచ్చు. అభిమానులను ఆకట్టుకునేలా ఆసక్తికరంగా ఈ టీజర్‌ను రూపొందించారు. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, కాదంబరి కిరణ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
Also Read:
Thaman: థమన్ మ్యూజిక్ సెన్సెషన్‌కు రాధేశ్యామ్ డైరెక్టర్ ఫిదా.. ప్రభాస్ సినిమా కోసం మరో ప్లాన్..
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై హైకోర్టు కీలక ఆదేశాలు..