Thaman: థమన్ మ్యూజిక్ సెన్సెషన్‏కు రాధేశ్యామ్ డైరెక్టర్ ఫిదా.. ప్రభాస్ సినిమా కోసం మరో ప్లాన్..

నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Thaman: థమన్ మ్యూజిక్ సెన్సెషన్‏కు రాధేశ్యామ్ డైరెక్టర్ ఫిదా.. ప్రభాస్ సినిమా కోసం మరో ప్లాన్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 14, 2021 | 5:43 PM

నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు.. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అఖండ సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా అఖండ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అఖండ మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్ పెంచితే స్పీకర్స్ పనిచేయవని థియేటర్స్ యాజమానులుజ విజ్ఞప్తి చేసే పరిస్థితి నెలకొంది. మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన సినిమాకు.. బాలకృష్ణ నటన.. తమన్ మ్యూజిక్ సెన్సెషన్ క్రియేట్ చేశాయి. తమన్ దరువుకు డైరెక్టర్స్ ఫిదా అయ్యారు.

తాజాగా తమన్‏తో రాధేశ్యామ్ చిత్రానికి రీరికార్డింగ్ చేయించేందుకు యూవీ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్. ఇప్పటికే రాధేశ్యామ్ పాటలకు ఒక్కో భాషను బట్టి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‏ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఇక తెలుగులో రీరికార్డింగ్ చేయడానికి తమన్ బెస్ట్ అనుకుంటున్నారట మేకర్స్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ మ్యూజిక్ కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తుండగా.. హిందీ వెర్షన్‏కు మిథున్, అర్మాన్ మాలిక్, అర్జీత్ సింగ్, మనన్ భరద్వాజ్ పనిచేస్తున్నారు. ఇక వీరే కాకుండా.. రాధేశ్యామ్ మ్యూజిక్ మరింత సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు తమన్‏ను రంగంలోకి దించుతున్నట్లుగా టాక్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్ మంచి స్పందన వచ్చింది.

Also Read: Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?