Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించినట్టు

Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..
Maa Committee
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 14, 2021 | 6:49 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించినట్టు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. రాజీనామా చేసిన ఆ పదకొండు మందిని రాజీనామా ఉపసంహరించుకోమని కోరానని, నెల రోజులు గడిచినా వారు మనసు మార్కుకోకపోవడంతో, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కాకుండా ఉండాలని వేరే వారితో ఆ పదవులను భర్తీ చేశామని విష్ణు చెప్పారు. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్‏తో సహా పదవులకు రాజీనామా చేసిన వారంతా ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని విష్ణు అన్నారు. అలాగే కళాకారుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా.. 914 మంది కోసం ఉచిత హెల్త్ క్యాంప్‏ను మెడికవర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించామని.. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. మా బిల్డింగ్ ప్రకటన ఓ వారం రోజుల్లో చేస్తామన్నారు మంచు విష్ణు.

ఇక హెల్త్ క్యాంపులో కళాకారులకు పలు రకాల మాస్టర్ హెల్త్ చెకప్స్ చేస్తున్నారని.. ఇందులో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారని.. మెడికవర్ వాళ్లు ఫిల్మ్ జర్నిలిస్టులకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ చేస్తారని.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంచు విష్ణు. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. సభ్యుల ఆరోగ్యం తమకు ముఖ్యమన్నారు. సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ ఆసుపత్రికి కృతజ్ఞతలు. చాలా ఆసుపత్రులలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఉచితంగా మాస్టర్ హెల్త చెకప్ చేయడానికి మెడికవర్ ఆసుపత్రి ముందుకు వచ్చింది.. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Also Read: Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?

Sathyaraj Son : హీరోగా కట్టప్ప కొడుకు.. శిబి సత్యరాజ్ హీరోగా రానున్న ‘మాయోన్’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!