Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?
నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను తగ్గించింది. కంపెనీ తన అన్ని ప్లాన్‌ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మీరు నెట్‌ఫ్లిక్స్ యొక్క ఒక నెల మొబైల్ ప్లాన్‌ను కేవలం..
Netflix Subscription Plans 2021: నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను తగ్గించింది. కంపెనీ తన అన్ని ప్లాన్‌ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మీరు నెట్‌ఫ్లిక్స్ యొక్క ఒక నెల మొబైల్ ప్లాన్‌ను కేవలం రూ. 149కి పొందుతారు. ఇది ఇంతకు ముందు ధర రూ.199గా ఉంది. అదే సమయంలో, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ధర రూ. 300 తగ్గించి రూ.199కి చేరుకుంది. కంపెనీ కొత్త ప్లాన్‌లకు ‘హ్యాపీ న్యూ ప్రైస్’ అని పేరు పెట్టింది. కొత్త రేట్లు నేటి నుంచి అంటే డిసెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్లాన్ ధరలు ఎలా ఉన్నాయంటే.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కంపెనీ మొబైల్ ప్లాన్ రూ.199 నుంచి రూ.149కి తగ్గింది. బేసిక్ ప్లాన్ ప్రస్తుతం రూ.499 నుంచి రూ.199కి తగ్గించారు. స్టాండర్డ్ ప్లాన్ రూ.649 నుంచి రూ.499కి తగ్గింది. ప్రీమియం ప్లాన్ రూ.799కి బదులుగా రూ.649కి అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ ఖరీదైనది.. అయితే ఓవైపు నెట్‌ఫ్లిక్స్ ధరలు తగ్గిస్తే.. అమెజాన్ ప్రైమ్ మాత్రం ధరలను అమాంతం పెంచింది. డిసెంబర్ 14 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను కంపెనీ రూ.50 నుంచి రూ.500 వరకు పెంచింది. ఇప్పుడు వినియోగదారులు తాజా వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూడటానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కంపెనీ భారత్‌లో ఇతర కంపెనీల కంటే చాలా వెనుకబడి ఉంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు పోటీగా నెట్‌ఫ్లిక్స్ ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది. మీడియా పార్టనర్స్ ఆసియా (MPA) అంచనాల ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రిప్షన్ వినియోగదారుల పరంగా చాలా వెనుకబడి ఉంది. 2021 చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ 5.5 మిలియన్ల వినియోగదారులను పొందుతుందని అంచనా వేశారు. ఇది హాట్‌స్టార్ డిస్నీ (46 మిలియన్లు), అమెజాన్ ప్రైమ్ (20 మిలియన్లు) కంటే చాలా తక్కువగా ఉంది.
Also Read: Ola Electric Scooter: ఓలా బుకింగ్ దారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 15 నుంచి డెలివరీ ప్రారంభం..
PM Kisan: రైతులు అలర్ట్.. పదో విడత రాకముందే ఈ పని పూర్తి చేయండి.. లేదంటే..?