Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Superstar Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ అయింది. ఆయన మోకాలికి ఆపరేషన్ జరిగింది. కొన్ని రోజు నుంచి

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..
Mahesh Babu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 14, 2021 | 2:11 PM

Superstar Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ అయింది. ఆయన మోకాలికి ఆపరేషన్ జరిగింది. కొన్ని రోజు నుంచి మోకాలినొప్పితో బాధపడుతున్న మహేష్ బాబుకు స్పెయిన్‌లో ఆపరేషన్ జరిగింది. మహేష్ ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇదిలాఉంటే.. మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారువారిపాట సినిమా చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా తర్వత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

కాగా.. మహేష్ బాబుకు సర్జరీ జరగడంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. మహేష్ కోలుకున్న అనంతరం ఈ సినిమా షూటింగ్ జరగనుంది.

Also Read:

Bangarraju : బంగార్రాజు నుంచి మ్యూజికల్ పోస్టర్.. చిట్టీతో కలిసి స్టెప్పులేస్తున్న నాగార్జున-నాగచైతన్య

MLA Roja: ఎమ్మెల్యే రోజాకు తృటితో తప్పిన ప్రమాదం.. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్‎కు ఏమైందంటే..