Bangarraju : బంగార్రాజు నుంచి మ్యూజికల్ పోస్టర్.. చిట్టీతో కలిసి స్టెప్పులేస్తున్న నాగార్జున-నాగచైతన్య

కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Bangarraju : బంగార్రాజు నుంచి మ్యూజికల్ పోస్టర్.. చిట్టీతో కలిసి స్టెప్పులేస్తున్న నాగార్జున-నాగచైతన్య
Bangarraju
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2021 | 1:17 PM

కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది. ఇక సోగ్గాడే చిన్ని నాయన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. నాగ్ కెరియర్ లో సోగ్గాడే సినిమా ఓ మెయిలు రాయిలా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా నాగార్జున తోపాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. అలాగే నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య సరసన కృతి శెట్టి సందడి చేయనుంది. ఇక ఈ సినిమా నుంచి మరో పాట రావడానికి రెడీగా ఉంది. బంగార్రాజు నుంచి మాస్ మసాలా సాంగ్ ను విడుదల చేయనున్నారు. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ అదిరిపోయే పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పాటలో నాగార్జున నాగచైతన్య కలిసి జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా తో స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. “ఓయ్ బంగార్రాజు నువ్వు పెళ్లిచేసుకొని వెళ్ళిపోతే బంగార్రాజు.. మాకు ఇంకెవ్వరు కొనిపెడతారు కొక బ్లౌజు “.. అంటూ సాగే మ్యూజికల్ పోస్టర్ ను వదిలారు. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anchor Ravi: పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. అసలు ఏం జరిగిందంటే..

Meena Photos: అందం అభినయం కలగలిపినట్టు మెరిసిపోతున్న ‘మీనా’ ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Priyanka Jawalkar: కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్న టాక్సీవాలా భామ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!