AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Ravi: పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. అసలు ఏం జరిగిందంటే..

Anchor Ravi: బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. చాలా షోల్లో తన మాటలతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యాంకర్ రవి.

Anchor Ravi: పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. అసలు ఏం జరిగిందంటే..
Ravi
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2021 | 12:32 PM

Share

బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. చాలా షోల్లో తన మాటలతో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యాంకర్ రవి. ఆ తర్వాత హీరోగానూ ట్రై చేశాడు. అయితే వెండి తెర కంటే బుల్లితెర పైనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు రవి. ఇక నాగార్జున హోస్ట్‌గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు రవి. ఇదిలా ఉంటే రవి ఇప్పుడు పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తుంది. తన పై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి పై చర్యలు తీసుకోవాలని యాంకర్ రవి పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై మరియు తన కుటుంబ సభ్యులపై కొందరు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాడట రవి.

తన పైనే కాకుండా తన కుటుంబ సభ్యుల పై కొందరు అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని రవి పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తుంది. తన పై ఎన్ని రకాల కామెంట్స్ చేసిన పట్టించుకోని రవి.. తన కుటుంబసభ్యుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేయడం పై  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్ కు సమాధానం చెప్పాల్సిందే అని రవి అంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. రవి బయటకు రావడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడని తెలుస్తుంది. ఇక యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vikrant Rona: 14 భాషల్లో 55 దేశాల్లో రిలీజ్ కానున్న క‌న్న‌డ బాద్ షా కిచ్చ సుదీప్ సినిమా..!!

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు