AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీకి సంబంధించి ఓ చిన్న ఈవెంట్‌ జరిగినా ఆయన..

Allu Arjun: 'మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి'.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..
Allu Arjun
Narender Vaitla
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 16, 2021 | 12:45 PM

Share

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీకి సంబంధించి ఓ చిన్న ఈవెంట్‌ జరిగినా ఆయన ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున హంగామా చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో బన్నీ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అల్లు అర్జున్‌తో ఫ్యాన్స్‌ మీట్‌ ఈవెంట్‌ ఉందని సమాచారంతో ఫ్యాన్స్‌ ఒక్కసారిగా భారీగా గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు చేరుకున్నారు. అయితే భారీ ఎత్తున అభిమానులు రావడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే క్రమంలో స్వల్ప లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

అయితే ఈ విషయంపై అల్లు అర్జున్‌ విచారణ వ్యక్తం చేశారు. ఈ విషయమై ట్వీట్ చేసిన బన్నీ.. ‘ఫ్యాన్స్‌ మీట్‌ ఈవెంట్‌ ఉందనుకొని వచ్చిన నా అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నా టీమ్‌ పర్సనల్‌గా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’ అంటూ రాసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం ఈ నెల 17న తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలవుతోన్న విషయం తెలిసిందే.

బన్నీ ట్వీట్..

Also Read: Gurthunda Seethakalam: గుర్తుందా శీతాకాలం నుంచి లేటేస్ట్ అప్డేట్.. తమన్నా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..

Big News Big Debate: జనసేనాని ఎటాక్.. వైసీపీ కౌంటర్ ఎటాక్.. ఏపీలో మరోసారి వేడెక్కిన రాజకీయం..

TV9 Digital TOP 9 NEWS: సొరంగంలో సెక్స్‌ రాకెట్‌.. కిట్టి పార్టీ డాన్‌కు భారీ షాక్‌..!