AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: అది మాములు విషయం కాదు, సమంతను చూసి షాకయ్యా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రష్మిక మందన్నా..

Rashmika: ప్రస్తుతం సినీ లవర్స్‌ అందరి చూపు పుష్ప చిత్రంపై పడింది. సుకుమార్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం..

Rashmika: అది మాములు విషయం కాదు, సమంతను చూసి షాకయ్యా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రష్మిక మందన్నా..
Rashmika
Narender Vaitla
|

Updated on: Dec 13, 2021 | 11:14 PM

Share

Rashmika: ప్రస్తుతం సినీ లవర్స్‌ అందరి చూపు పుష్ప చిత్రంపై పడింది. సుకుమార్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్‌ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కించారు. ఇక ట్రైలర్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. రష్మిక తొలిసారి డీగ్లామర్‌ పాత్రలో నటిస్తుండడం, చిత్రంలోని పాత్రలన్నీ అత్యంత సహజంగా ఉండడంతో సినిమాను క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సమంత చాలా రోజుల తర్వాత గ్లామరస్‌గా కనిపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ పాటపై పడింది. ఓవైపు హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే సమంత స్పెషల్‌ సాంగ్‌లో నటించడంతో ఈ పాట హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 17న విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే రష్మిక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సమంత ఓవైపు సూపర్‌స్టార్‌గా రాణిస్తూనే, మరోవైపు స్పెషల్‌ సాంగ్‌ చేయడం అంటే మాములు విషయం కాదు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి షాకయ్యా. సాంగ్‌ షూట్‌ అవగానే అద్భుతంగా చేశావని సామ్‌కి మెసేజ్‌ పంపించా. అయితే ఇలాంటి అవకాశం నాకు వస్తే మాత్రం చేస్తానో లేదో కశ్చితంగా చెప్పలేను’ అని రష్మిక చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Gurthunda Seethakalam: గుర్తుందా శీతాకాలం నుంచి లేటేస్ట్ అప్డేట్.. తమన్నా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..

KK – Etela Rajender: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. వైరల్‌గా మారిన ఈటల, కేకే పలకరింపు..

Big News Big Debate: జనసేనాని ఎటాక్.. వైసీపీ కౌంటర్ ఎటాక్.. ఏపీలో మరోసారి వేడెక్కిన రాజకీయం..