Marakkar: అప్పుడే ఓటీటీలోకి మోహన్‌లాల్ మరక్కార్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'మరక్కార్: అరేబియా సముద్ర సింహం'. మంజు వారియర్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’. మంజు వారియర్, అర్జున్, కీర్తి సురేశ్, సునీల్ శెట్టి, సుహాసినీ, కల్యాణి ప్రియదర్శన్ వంటి అగ్రతారలు ఈ సినిమాలో నటించారు. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. 2020 మార్చిలోనే విడుదల కావల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఒకానొక దశలో ఓటీటీలో రిలీజ్ చేద్దామని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఎట్టకేలకు డిసెంబర్2న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడంతో ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.
విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది ‘మరక్కార్’. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ మాధ్యమంలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిసెంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. అంతేకాదు దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ విడుదల చేసింది. థియేటర్లలో విడుదలైన 15 రోజులకే ‘మరక్కార్’ ఓటీటీలోకి రావడం గమనార్హం.Also Read:
PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. తెరకెక్కించనున్న ప్రకాశ్ ఝా