Victrina Wedding: స్పెషల్‌ గిఫ్ట్‌తో కొత్త దంపతులను సర్‌ప్రైజ్ చేసిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు!.. ఎవరెవరు ఏమేమి ఇచ్చారంటే..

తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరా హాటల్‌ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది.

Victrina Wedding: స్పెషల్‌ గిఫ్ట్‌తో కొత్త దంపతులను సర్‌ప్రైజ్ చేసిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు!.. ఎవరెవరు ఏమేమి ఇచ్చారంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2021 | 10:21 PM

తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరా హాటల్‌ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కాగా తమ పెళ్లికి వచ్చిన అతిథులకు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేశారు న్యూ కపుల్‌. ఈ క్రమంలో పెళ్లికి హాజరైన బాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు హాజరుకాని వారు కూడా విక్ర్టీనా దంపతులకు ఖరీదైన బహుమతులను అందించారట. ముందుగా విక్కీ కౌశల్ తన సతీమణికి సుమారు రూ. 1.3 కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్‌ను బహమతిగా ఇచ్చాడట. దీనిని ప్రత్యేకంగా లండన్‌లో తయారుచేయించారని సమాచారం. ఇది గాకుండా దుబాయ్‌లో రూ. 50కోట్ల విలాసవంతమైన ప్యాలెస్‌ను కత్రినాకు గిఫ్ట్‌గా అందించాడట. ఇక విక్కీ తల్లి తన కోడలి కోసం రూ. 16 లక్షల విలువైన బంగారు హారాన్ని బహుమతిగా అందించారట.

ఇక ఈ పెళ్లికి హాజరు కాని అలియా భట్‌ విక్ట్రీనా దంపతుల కోసం రూ. 7లక్షల విలువైన బ్రాండెడ్‌ లెదర్‌ జాకెట్‌ను పంపించిందట. ఇక కత్రినాను బాలీవుడ్‌కి పరిచయం చేసిన సల్లూభాయ్‌ రూ. 3కోట్ల విలువ జేసే రేంజ్ రోవర్ కారును కత్రినాకు బహుమతిగా అందించాడు. ఇక క్యాట్‌తో గతంలో డేటింగ్‌ చేసిన రణ్ బీర్ కపూర్ రూ.2.7కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక షారూఖ్‌ ఖాన్ రూ.1.5లక్షల విలువ జేసే ఖరీదైన పెయింటింగ్‌ను విక్ర్టీనా దంపతులకు ఇచ్చినట్లు సమాచారం. ఇక బాలీవుడ్ హ్యాండ్సమ్‌ హీరో హృతిక్ రోషన్ రూ.12 లక్షల విలువైన హ్యాండ్‌మేడ్‌ ఫ్లవర్‌ వాజ్‌ను బహుమతిగా ఇచ్చాడట. ఇక గతంలో విక్కీతో కలిసి నటించిన తాప్సీ కొత్త దంపతులకు రూ.1.4లక్షల విలువజేసే ప్లాటినం బ్రాస్‌లేట్‌ను గిఫ్ట్‌గా అందించిందట. ఇక విక్ట్రీనా దంపతులిద్దరికీ సన్నిహితుడైన అక్షయ్‌ కుమార్‌ రూ. 6 కోట్ల లంబోర్ఘినీ కారును మ్యారేజ్‌ గిఫ్ట్‌గా ప్రదానం చేశారట.

Also Read:

Gurthunda Seethakalam: గుర్తుందా శీతాకాలం నుంచి లేటేస్ట్ అప్డేట్.. తమన్నా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..

Prabhu deva: జీనీగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌.. ఆకట్టుకుంటోన్న మై డియర్‌ భూతం మోషన్‌ పోస్టర్‌..

Bangarraju Movie: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమైన బంగర్రాజు టీం.. రేపు మూడో సింగిల్‌ అప్డేట్‌..