Big News Big Debate: జనసేనాని ఎటాక్.. వైసీపీ కౌంటర్ ఎటాక్.. ఏపీలో మరోసారి వేడెక్కిన రాజకీయం..

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పేరుతో దీక్ష చేసినా, పవన్‌ వ్యాఖ్యలు...

Big News Big Debate: జనసేనాని ఎటాక్.. వైసీపీ కౌంటర్ ఎటాక్.. ఏపీలో మరోసారి వేడెక్కిన రాజకీయం..
Big News Big Debate
Follow us

|

Updated on: Dec 13, 2021 | 8:57 PM

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పేరుతో దీక్ష చేసినా, పవన్‌ వ్యాఖ్యలు 2024 ఎన్నికల చుట్టే తిరిగాయి. YCP ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుందామంటున్నారు జనసేనాని. జగన్‌ అధికారంలోకి రావడంపై ఏడుపు తప్ప పవన్‌ ప్రసంగంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తావన ఎక్కడుందని ప్రశ్నిస్తోంది వైసీపీ. చంద్రబాబు తెరవెనక ఉండి ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించింది అధికార పార్టీ. స్టీల్‌ ప్లాంట్‌పై నిలదీయాల్సిన కేంద్రాన్ని వదిలేసి పార్టీలు ఒకరిపై ఒకరు నిందలతో ఎందుకు రాజకీయం చేస్తున్నాయి.?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దీక్ష చేశారు. ముగింపు సందర్భంగా జనసేనాని అధికార YCPని టార్గెట్‌ చేశారు. అప్పులు, అమరావతి, మద్యం, ఆర్థిక పరిస్థితి, రౌడీయిజం, బూతులు ఇలా అన్ని అంశాలను టచ్‌ చేస్తూ ప్రసంగాన్ని మొత్తం వైసీపీపై విమర్శలతో హోరెత్తించారు.

151 మంది MLAలు, మెజార్టీ MPలు ఉండి స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోలేని దుస్థితిలో YCP ఉందన్నారు పవన్‌. 15వందలు, రెండు వేలు తీసుకుని YCPని గెలిపించి ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రావడం తిరుమల కొండకు కూడా ఇష్టం లేదని, అందుకే ఎన్నడూ చూడని వరదలు వచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్‌. మీడియా, న్యాయమూర్తులు, వ్యాపారులు అందరినీ భయపెడుతున్నారని… అసెంబ్లీలో కూడా బూతులు తిట్టే ప్రభుత్వాన్ని 2024లో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. మరో రెండున్నరేళ్లు ప్రభుత్వాన్ని భరించక తప్పదన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి అర్ధం మార్చిన వైసీపీ ప్రభుత్వం, చివరకు తన సినిమాలు ఆపి ఆర్ధికంగా మూలాలు దెబ్బకొట్టే ప్రయత్నం చేసిందన్నారు జనసేనాని. ఫైనల్‌గా AP ఆరోగ్యానికి వైసీపీ హానికరం అంటూ నినాదం అందుకున్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో దీక్ష పెట్టి వైసీపీపై తన ఏడుపంతా తీర్చుకున్నారంటోంది వైసీపీ. తన బాస్‌ చంద్రబాబుకు అధికారం దక్కలేదన్న అక్కసు మాత్రమే దీక్షలో కనిపించిందన్నారు MLA అంబటి. వైసీపీ ఎంపీలకు ప్లకార్డులు పట్టుకునే దమ్ముందా అంటున్న పవన్‌ ఇదే విషయంలో బీజేపీ ఆఫీసు ముందు దీక్ష చేయగలరా అని ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డి మంచి చేస్తే పొగడలేడు. చంద్రబాబు దుర్మార్గం చేసినా ప్రశ్నించలేడు. రెండు కలిపితే పవన్‌ కల్యాణ్‌ అంటూ ఎద్దేవా చేసింది YCP. పవన్‌ దీక్ష చేసింది స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోవడానికే అంటోంది జనసేన కేడర్‌. కాదు చంద్రబాబు కోసం ఆడుతున్న డ్రామాలో భాగమంటోంది YCP. నిజంగానే పవన్‌ వెనక టీడీపీ ఉందా? లేదంటే తమను తాకిన విమర్శలకు సమాధానంగా వైసీపీ డైవర్షన్‌ స్కీమా?

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.