AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikrant Rona: 14 భాషల్లో 55 దేశాల్లో రిలీజ్ కానున్న క‌న్న‌డ బాద్ షా కిచ్చ సుదీప్ సినిమా..!!

క‌న్న‌డ బాద్ షా గా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్.

Vikrant Rona: 14 భాషల్లో 55 దేశాల్లో రిలీజ్ కానున్న క‌న్న‌డ బాద్ షా కిచ్చ సుదీప్ సినిమా..!!
Vikrant Rona
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2021 | 9:47 AM

Share

Vikrant Rona: క‌న్న‌డ బాద్ షా గా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్. ఆతర్వాత బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు సుదీప్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. సుదీప్ నటిస్తున్న తాజా  చిత్రం విక్రాంత్ రోణ‌. పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌తో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చిన ఈ త్రీడీ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర‌స్ జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ తెలియ‌జేశారు. కిచ్చా సుదీప్‌తో, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ప్రతిరోజు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తూ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చారు. రీసెంట్ గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మాతలు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్‌ ఆర్ట్ డైరక్టర్‌ మెస్మరైజ్‌ చేసే సెట్స్ వేశారు. విలియమ్‌ డేవిడ్‌ కెమెరాపనితనం విజువల్‌ ఫీస్ట్ గ్యారంటీ అనే ఫీలర్స్ ఇస్తోంది. కిచ్చా సుదీప్‌, నిరుప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Rashmika: అది మాములు విషయం కాదు, సమంతను చూసి షాకయ్యా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రష్మిక మందన్నా..

Follow Us
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి