Shyam Singha Roy: ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన శ్యామ్ సింగరాయ్.. ఆకట్టుకుంటున్న నయా పోస్టర్
న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
Shyam Singha Roy: న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గగెటప్స్ లో కనిపించనున్నాడు నాని. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్స్ లో రానుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘వి’ సినిమా ఓటీటీ వేదికగానే విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే రీసెంట్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేశాడు నాని. ఈ సినిమా కూడా ఓటీటీనే నమ్ముకొని రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. కానీ ఈ సారి థియేటర్స్ లో వచ్చి సాలిడ్ హిట్ కొడతా అంటున్నాడు నాని.
ఇక ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా పై నాని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. నాని – సాయిపల్లవి జంటగా కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సాయిపల్లవితోపాటు కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కూడా ఇందులో కథానాయికలుగా కనిపించనున్నారు.
Let’s begin Trailer Tomorrow ♥️ Christmas Maathram …… 🙂#ShyamSinghaRoy #SSRonDEC24th pic.twitter.com/DPxh1xereq
— Nani (@NameisNani) December 13, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :