AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sathyaraj Son : హీరోగా కట్టప్ప కొడుకు.. శిబి సత్యరాజ్ హీరోగా రానున్న ‘మాయోన్’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్

సీనియర్ నటుడు సత్యరాజ్  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. సత్య రాజ్ అంటే ఎక్కువమంది గుర్తుపట్టక పోవచ్చు కానీ కట్టప్ప అంటే టక్కున గుర్తుపట్టేస్తారు.

Sathyaraj Son : హీరోగా కట్టప్ప కొడుకు.. శిబి సత్యరాజ్ హీరోగా రానున్న 'మాయోన్'.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్
Sibi Sathyaraj
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2021 | 1:25 PM

Share

Sibi Sathyaraj: సీనియర్ నటుడు సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. సత్య రాజ్ అంటే ఎక్కువమంది గుర్తుపట్టక పోవచ్చు కానీ కట్టప్ప అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. బాహుబలిస్ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా మారారు. శిబి నటిస్తున్న సినిమా ‘మాయోన్’. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్సాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మాంపాహి’ అనే పాట విడుదలైంది. దీనికి మంచి అప్లాజ్ వస్తుంది. మ్యూజిక‌ల్ మేజిషియ‌న్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో ఈ సినిమా వస్తుండటం విశేషం. కిషోర్ ఎన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తుండడం గమనార్హం. ఇక తాజాగా విడుద‌లైన మాంపాహి పాట ఇప్పుడు ఇళ‌య‌రాజా అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది, అంతే కాదు అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కులు ఈ పాట‌కు అనూహ్య స్పంద‌న అందిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు ఈ పాట తమిళ వెర్ష‌న్ యూ ట్యూబ్ లో 24 గంటలలోపే మిలియ‌న్ వ్యూస్ పైగా అందుకోవ‌డం విశేషం. రామ్ పాండ్యన్ – కొండల రావు ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాను సీనియర్ సినిమాటోగ్రాఫ‌ర్ రామ్ ప్రసాద్ అత్యద్భుతంగా తెర‌కెక్కించిన‌ట్లుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు. అలానే ఈరోజు వైకుంఠఏకాద‌శి, గీత జ‌యంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కులంద‌రికీ మాయోన్ చిత్ర యూనిట్ శుభ‌కాంక్ష‌లు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anchor Ravi: పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. అసలు ఏం జరిగిందంటే..

Meena Photos: అందం అభినయం కలగలిపినట్టు మెరిసిపోతున్న ‘మీనా’ ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Priyanka Jawalkar: కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్న టాక్సీవాలా భామ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)