AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన చిత్రం 'రాధేశ్యామ్‌'. 'జిల్‌' ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి.

Radhe shyam: 'సంచారి' గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్..   రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..
Basha Shek
|

Updated on: Dec 14, 2021 | 2:58 PM

Share

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు తక్కువ సమయం ఉండడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా వరుసగా అప్డేట్స్‌ ఇస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మూవీ మేకర్స్‌.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ ప్రేమకథ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సంగీతాభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా మూడో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటను అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. 16న పూర్తి పాట విడుదల కానుంది. కాగా ఈ సాంగ్‌ టీజర్‌లో ఎంతో స్టైలిష్ అండ్‌ ల్యావిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు డార్లింగ్‌.కాగా ఈ సాంగ్‌ టీజర్‌లో ఎంతో స్టైలిష్ అండ్‌ ల్యావిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు డార్లింగ్‌. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:

Mahesh Babu Surgery: మహేష్ బాబు మోకాలికి శస్త్ర చికిత్స.. (లైవ్ వీడియో)

MLA Roja: ఎమ్మెల్యే రోజాకు తృటితో తప్పిన ప్రమాదం.. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్‎కు ఏమైందంటే..

Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి