- Telugu News Photo Gallery Add these foods in your diet for iron and help to fight iron deficiency anemia Telugu Health Tips
Health Tips: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉందా..? ఈ లోపాన్ని అధిగమించడానికి ఇవి తినండి చాలు..
Iron Deficiency Anemia: శరీరంలో ఐరన్ లోపంతో ఎన్నో రకలా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. రక్తహీనత వల్ల అలసట, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, చేతులు/కాళ్లు చల్లబడటం, పాలిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి మీరు ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే.. రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Dec 14, 2021 | 9:25 PM

బచ్చలికూర - నిపుణులు తరచుగా పచ్చి కూరగాయలతోపాటు.. ముఖ్యంగా ఆకు కూరలు తినమని సలహా ఇస్తుంటారు. ఈ ఆకూకురలు ఏవైనా ఆరోగ్యానికి మంచివే. పాలకూర, బచ్చలికూరల్లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. మీరు దీన్ని వారానికి రెండుసార్లు వీటిని తీసుకుంటే ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు.

అలిచెంత గింజలు- అలసందలు (బ్లాక్ ఐడ్ పీస్) లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన 26-29% ఐరన్ ను పుష్కలంగా అందిస్తాయి. అందువల్ల మీరు వీటిని క్రమం తప్పకుండా తింటే చాలా మంచిది. ఇవి ఐరన్ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి.

బెల్లం - మీరు చక్కెరకు బదులుగా బెల్లంను తింటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది షుగర్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే.. మీరు బెల్లం తినవచ్చు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

ఉసిరి - విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉసిరిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఉసిరిని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. మీరు ఆమ్లా ఊరగాయ, మిఠాయి లేదా మురబ్బా వంటి వంటకాలను చేసుకొని ఇష్టంగా తినవచ్చు. ఉసిరికాయను ఉడికించి లేదా పచ్చిగా తినవచ్చు. ఉసిరికాయను రోజూ తీసుకుంటే రక్తం పెరగడంతోపాటు శరీరానికి చాలా మేలు చేస్తుంది.

నానబెట్టిన ఎండుద్రాక్ష - చాలా వరకు ఎండిన పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో రాగి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎనిమిది నుంచి పది ఎండు ద్రాక్షలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా.. ఉదర సమస్యలను దూరం చేస్తాయి.





























