Radhe Shyam: ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన రాధేశ్యామ్‌ టీమ్‌.. భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఎప్పుడంటే..

Radhe Shyam: కరోనా కారణంగా తీవ్రంగా నిరాశ చెందిన సినీ లవర్స్‌కు డిసెంబర్‌, జనవరి ఫుల్‌ మీల్స్‌ను అందించేందు మేకర్స్ సిద్ధమవుతున్నారు. భారీ చిత్రాలు విడుదలవుతుండడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సందడి...

Radhe Shyam: ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన రాధేశ్యామ్‌ టీమ్‌.. భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఎప్పుడంటే..
Radhe Shyam
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 15, 2021 | 9:53 AM

Radhe Shyam: కరోనా కారణంగా తీవ్రంగా నిరాశ చెందిన సినీ లవర్స్‌కు డిసెంబర్‌, జనవరి ఫుల్‌ మీల్స్‌ను అందించేందు మేకర్స్ సిద్ధమవుతున్నారు. భారీ చిత్రాలు విడుదలవుతుండడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ జాబితాలోకే వస్తుంది ప్రభాస్‌ హీరోగా వస్తోన్న రాధేశ్యామ్‌ చిత్రం. ప్రభాస్‌ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే జనవరి 14న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విడుదలకు ఇంకా నెల రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్‌. ఇప్పటికే పాటలు, టీజర్లు విడుదల చేస్తూ డార్లింగ్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు సిద్ధమైంది.

భారీ ఎత్తున ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు రాధే శ్యామ్‌ యూనిట్‌ పనులు మొదలు పెట్టింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న ఈ సినిమా ఈవెంట్‌ను కూడా అదే స్థాయిలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 23న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ ఎత్తున అభిమానులు, ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని రామోజీ ఫిలిమ్‌ సిటీలో నిర్వహించనున్నారని సమాచారం. ఇక ఇదే వేదికగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

టీ సిరీస్ ఫిల్మ్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ విడుదల చేసిన టీజర్‌లు, పోస్టర్స్‌లో కేవలం ప్రభాస్‌, పూజా పాత్రలను మాత్రమే చూపించారు. అంతేకాకుండా సినిమా కథను కూడా ఏ మాత్రం రిలీవ్‌ చేయలేదు. మరి ట్రైలర్‌తోనైనా సినిమా కథపై ఏమైనా క్లారిటీ వస్తుందో చూడాలి.

Also Read: Sonia Gandhi: కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి.. సోనియా నివాసంలో ఐదు పార్టీల నేతల భేటీ.. మమతను ఆహ్వానించని కాంగ్రెస్..

Indian Railways: వంద రూట్లలో ప్రైవేట్ రైళ్ళు.. టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వ సన్నాహాలు!

Savings Tips: చిన్న చిన్న పనులు పెద్ద లాభాన్నిస్తాయి.. ఇలా చేస్తే విద్యుత్ ఆదా అవుతుంది..మీ జేబు ఖాళీ కాకుండా ఉంటుంది