Sonia Gandhi: కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి.. సోనియా నివాసంలో ఐదు పార్టీల నేతల భేటీ.. మమతను ఆహ్వానించని కాంగ్రెస్..

రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేతపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని సోనియాగాంధీ నిర్ణయించారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై పోరాటం చేసేందుకు ఐదు పార్టీల నేతలతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి తృణమూల్‌ను ఆహ్వానించలేదు.

Sonia Gandhi: కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి.. సోనియా నివాసంలో ఐదు పార్టీల నేతల భేటీ.. మమతను ఆహ్వానించని కాంగ్రెస్..
Sonia Gandhi
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 14, 2021 | 9:43 PM

Sonia Gandhi Holds Opposition Meet: రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాలు నిరసనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ అంశంపై చర్చించేందుకు సోనియాగాంధీ నివాసంలో ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు . ఈ సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ , సీపీఎం నేత సీతారాం ఏచూరి , శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ , డీఎంకే నేత బాలు , నేషనల్ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. విపక్ష ఎంపీలు క్షమాపణలు చెబితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా విపక్ష ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.

సస్పెన్షన్‌ను నిరసనగా పార్లమెంట్‌ భవన్‌ నుంచి విజయ్‌ చౌక్‌ వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీ తీశారు. రాజ్యాంగ విరుద్దంగా ఎంపీలను సస్పెండ్‌ చేశారని , వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్‌గాంధీ. రైతులను కేంద్రమంత్రి హత్య చేసిన విషయం ప్రధాని మోదీకి తెలుసని ఆరోపించారు రాహుల్‌. పార్లమెంట్‌ సమావేశాలకు రాకుండా మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. విపక్షాలను మాట్లాడకుండా చేసి ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు.. 12 మంది ఎంపీల సస్పెన్షన్‌కు కారణం రాజ్యసభ ఛైర్మన్‌ , ప్రధాని మోదీ కాదని , ఆ ముగ్గురు పారిశ్రామికవేత్తలే అని రాహుల్‌ విమర్శించారు. కీలకమైన బిల్లులను ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌.

ఇవి కూడా చదవండి: Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ

భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామిజీ పిలుపు