భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామిజీ పిలుపు

భారతదేశం ఎప్పుడూ విశ్వగురువే అన్నారు శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి. పురాణ గ్రంథాలు పుక్కిటి పురాణాలు కావన్నారు. భగవద్గీతను ఆచరించి..భావి తరాలకు అందించాలని పిలుపునిచ్చారు జీయర్‌ స్వామి. ప్రపంచంలో..

భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామిజీ పిలుపు
Laksha Yuva Gala Geetarchan
Follow us

|

Updated on: Dec 14, 2021 | 9:11 PM

VHP – Laksha Yuva Gala Geetarchana: హైదరాబాద్‌ LB స్టేడియంలో లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గీతా జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష మంది యువతీ, యువకులతో లక్ష యువగళ గీతార్చన నిర్వహించింది. భగవద్గీతలోని 40 శ్లోకాలను సామూహికంగా యువతీ, యువకులు పారాయణం చేయడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి వారు మాట్లాడుతు.. “భారతదేశం ఎప్పుడూ విశ్వగురువే అని అన్నారు. పురాణ గ్రంథాలు పుక్కిటి పురాణాలు కావన్నారు. భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని పిలుపునిచ్చారు జీయర్‌ స్వామి. ప్రపంచంలో వైజ్ఞానికులు అనుకునేవారు కళ్లు తెరవకముందే.. వారికి ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చింది భారతదేశమన్నారు చినజీయర్‌స్వామి. ఇది మనది అనే ఆత్మవిశ్వాసం కోల్పోయామన్నారు. పాఠశాలలో బోధించే పాఠాలవల్ల కొన్ని తరాలుగా మనల్ని మనం మరచిపోయమన్నారు. రామాయణం, మహాభారతం పుక్కిటి పురాణాలు కావని అవి వాస్తవాలేనన్నారు.”

లక్షయువ గళ గీతార్చన కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభను తలపించింది. కార్యక్రమం చివరిలో భారత ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు గీతా భక్తులు. నేటి యువతకు భగవద్గీతను దగ్గరచేసి వారిని సన్మార్గంలో నడిపేందుకు వీహెచ్‌పీ ఈ బృహత్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే భగవద్గీతలోని 40 శ్లోకాలను ఎంచుకొని గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కంఠస్థం చేయించారు. గంగాధరశాస్త్రి స్వరపరిచిన స్వరంలోనే ఈ లక్ష యువగళ గీతార్చన సామూహికంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోషాధికారి శ్రీ శ్రీ శ్రీ గోవింద్ గిరి జి మహారాజ్, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ ఉడుపీ పీఠం పెజావర్ స్వామి, అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే జీ, మై హోం గ్రూప్‌ ఛైర్మన్‌ డా.జూపల్లి రామేశ్వరావు, గోవింద గిరి జీ, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పలువురు స్వామీజీలు హాజరయ్యారు.

లక్ష యువగళ గీతార్చన కార్యక్రమానికి తెలంగాణతోపాటు జంటనగరాల నుండి వేలాది మంది తరలివచ్చారు. గత ఐదారు నెలలుగా భగవద్గీతలోని కీలక అధ్యయనంలోని శ్లోకాలు కంఠస్థం చేశారు గీతా కార్యకర్తలు. వారంతా సామూహికంగా ముక్త కంఠంతో భగవద్గీతలోని శ్లోకాలు పఠనం చేశారు.

ఇవి కూడా చదవండి: Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ