Staircase Vastu Rules: వాస్తు ప్రకారం మీ ఇంటి మెట్లు ఎలా ఉండాలో తెలుసుకోండి.. దానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలు ఇవే..
ఏదైనా ఇల్లు లేదా భవనం నిర్మించేటప్పుడు వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రత్యేకించి మీరు ఇల్లు లేదా భవనానికి మెట్లు వేసేటప్పుడు దానికి సంబంధించిన వాస్తు నియమాలను విస్మరించడం మర్చిపోవద్దు.
ఏదైనా ఇల్లు లేదా భవనం నిర్మించేటప్పుడు వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రత్యేకించి మీరు ఇల్లు లేదా భవనానికి మెట్లు వేసేటప్పుడు దానికి సంబంధించిన వాస్తు నియమాలను విస్మరించడం మర్చిపోవద్దు. లేకుంటే ఆనందం, శ్రేయస్సు , అదృష్టాన్ని అందించే ఇంట్లోని మెట్లు మీ దుఃఖానికి, పేదరికానికి , దురదృష్టానికి పెద్ద కారణం కావచ్చు. వాస్తు ప్రకారం మెట్లను తయారు చేసేటప్పుడు.. దాని పరిమాణం, దిశ, సంఖ్య మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మెట్లకు సంబంధించిన ముఖ్యమైన వాస్తు నియమాలను తెలుసుకుందాం.
మెట్లు ఏ దిశలో వేయాలి?
వాస్తు ప్రకారం ఏదైనా ప్లాట్‌కి పశ్చిమం, నైరుతి, మధ్య దక్షిణం, పశ్చిమ దిశలలో మెట్లు వేయడం ఎల్లప్పుడూ శుభప్రదం. వాస్తు ప్రకారం ఇంట్లో ఈశాన్యంలో.. బ్రహ్మస్థానం వద్ద మరచిపోయి కూడా మెట్లు వేయకూడదు.
మెట్లు ఎలా ఉండాలి
వాస్తు ప్రకారం ఉత్తరం నుండి దక్షిణం లేదా తూర్పు నుండి పడమర వరకు మెట్లు నిర్మించాలి. అదేవిధంగా మెట్ల సంఖ్య ఎల్లప్పుడూ బేసిగా ఉండాలి. అంటే -5,7,9,11,15,17 మొదలైనవి. వాస్తు ప్రకారం ఇంట్లో వంకర మెట్లు వేయకూడదు. మెట్ల ప్రారంభంలో చివరిలో గేట్లు ఏర్పాటు చేయండి. తలుపులు తయారు చేస్తున్నప్పుడు అవి తూర్పు, ఉత్తరం వైపుకు తెరుచుకేనేలా చూసుకోండి.
మెట్ల కింద ఈ విషయాలను గుర్తుంచుకోండి
తరచుగా ప్రజలు తమ ఇంటి కింద ఉన్న స్థలాన్ని ఉపయోగించుకోవడానికి వంటగది, బాత్రూమ్, షూ స్టాండ్ మొదలైనవాటిని తయారు చేస్తారు. ఇది వాస్తు ప్రకారం భారీ లోపాలను కలిగిస్తుంది. మీ ఆనందానికి .. అదృష్టానికి మీ మెట్లు కారణంగా మారకూడదూ అంటే ఇలాంటి పొరపాటు చేయకండి. అలాగే మెట్ల అడుగు భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
మెట్ల వాస్తు దోషం ఈ పరిహారం ద్వారా తొలగించబడుతుంది
మీ మెట్లు వాస్తు నిబంధనలకు విరుద్ధంగా మారి.. దాని వల్ల ఏర్పడే లోపాల వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. దానిని నివారించడానికి మీరు మీ మెట్ల పక్కన ఉన్న గోడపై స్వస్తికను రాసుకోండి. మెట్ల కింద ఏదైనా తప్పు జరిగితే.. అక్కడ తులసి మొక్కను ఏర్పాటు చేయండి. అలాగే, మెట్లపై ఎల్లప్పుడూ సరైన లైటింగ్ ఏర్పాటు చేసుకోండి.
ఇవి కూడా చదవండి: Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ
భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిజీ పిలుపు