Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ

ఉరుకుల పరుగుల జీవితం అంత టెక్నాలజీతో పరుగులు పెడుతోంది. డిజిటిల్ టెక్నాలజీతో అరచేతిలోనే స్వర్గం చూస్తున్నా మనం.. సమస్యలకు పరిష్కారాలను వెతడం..

Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ
Student Innovation
Follow us

|

Updated on: Dec 14, 2021 | 4:55 PM

Student Innovation: కాలం మారుతోంది.. కాలంతోపాటు మనం చేస్తున్న పనుల్లో మార్పులు రావాలి. ఇదే ఈ తరం కోరకుంటున్న నవతరం టెక్నాలజీ. ఉరుకుల పరుగుల జీవితం అంత టెక్నాలజీతో పరుగులు పెడుతోంది. డిజిటిల్ టెక్నాలజీతో అరచేతిలోనే స్వర్గం చూస్తున్నా మనం.. సమస్యలకు పరిష్కారాలను వెతడం పెద్ద విషయం కాదని నేటి తరం యువతం నిరూపిస్తున్నారు. సమస్యకు టెక్నాలజీతో చెక్ పెట్టడం ఎలాగో నిరూపించాడు నాగర్ కర్నూలు జిల్లా విద్యార్థి. వ్యవసాయ పొలాల వద్ద మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంటు షాకుకు గురై ఎంతో మంది రైతులు ప్రాణాలు వదులుతుంటారు. అందుకు రక రకాల కారణాల్లో తడి చేతులతో మోటార్ ఆన్ చేయడం కూడా ఒక కారణం. రెండేళ్ల క్రితం ఈ కారణంతోనే తండ్రికి ప్రమాదం జరిగింది. బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో రైతులు ప్రమాదాలకు గురి కాకూడదనే ఉద్దేశంతో ఓ ప్రయత్నం చేశాడు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై తడిసిన చేతులతో మోటార్ ను ఆన్ లేదా ఆఫ్ చేసే అవసరం లేకుండా సెన్సార్ తో పని చేసే పరికరాన్ని కనుగొన్నాడు. మోటార్ కు కొద్ది దూరంలో నిల్చొని చప్పట్లు కొడితే చాలు.. మోటార్ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. దీని వల్ల రైతులు కరెంటు షాక్ వంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారనేది ఆ విద్యార్థి ఉద్దేశం.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కళ్యాణ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ పాల్ టెక్నీక్ కళశాలలో ఎలక్ట్రిక్ విభాగం లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం వ్యవసాయ పొలం వద్ద బోర్ మోటార్ ఆన్ చేసే సమయంలో తండ్రి లక్ష్మయ్య విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదం విద్యార్ధి కళ్యాణ్ ను కదిలించింది. తన తండ్రి మాదిరిగా మరే రైతు బోరు మోటార్ వద్ద ప్రమాదానికి గురి కాకూదని భావించాడు.

మోటారా స్టార్టర్ ను ముట్టుకోకుండా ఆన్ లేదా ఆఫ్ చేసేలా ఏర్పాటు చేయాలనుకున్నాడు. మెదడుకు పదును పెట్టాడు. చప్పట్లు కొడితే చాలు మోటార ఆన్ లేదా ఆఫ్ అయ్యేలా పరికరాన్ని తయారు చేశాడు. ఇందుకు కేవలం 15 వందల రూపాయల మాత్రమే ఖర్చు చేశాడు. సోలార్ ప్యానల్, సర్వో మోటార్, సౌండ్ సెన్సార్, ఓ మోబైల్ ఫోను ను ఉపయోగించాడు. వీటిని స్టార్టర్ బాక్సులో అమర్చాడు.

చప్పట్లు కొడితే చాలు ఆన్ అవుతోంది. కళ్యాణ్ తయారు చేసిన పరికరాన్ని చూసి చుట్టుపక్కల రైతులు అభినందిస్తున్నారు. చిన్న వయస్సులోనే మంచి ప్రయత్నం చేశాడంటూ కొనియాడుతున్నారు. అవసరమైతే చప్పట్ల ఆప్షన్ ను లాక్ చేసి కూడా ఉంచుకోవచ్చని చెబుతున్నాడు కళ్యాణ్. ఇక రైతులు తడి చేతులతో బోరు మోటార్ ఆన్ చేయాల్సిన అవసరం లేదని, ప్రోత్సహిస్తే మరిన్ని కొత్త ప్రయోగాలు చేస్తానంటున్నాడు కళ్యాణ్.

సమీ. Tv9 రిపోర్టర్, మహబూబ్ నగర్ జిల్లా

ఇవి కూడా చదవండి: బాలీవుడ్‌లో థర్డ్‌ వేవ్‌ టెన్షన్‌.. కొంపముంచిన గెట్‌ టుగెదర్ పార్టీ.. కరణ్‌ జోహార్‌ ఇళ్లు సీజ్‌..

Beauty Pageants: అందాల పోటీలు కేవలం సౌందర్యపోటీలేనా.. దీనివెనుక మరో కోణం.. తప్పు పడుతున్న స్త్రీవాదులు