Beauty Pageants: అందాల పోటీలు కేవలం సౌందర్యపోటీలేనా.. దీనివెనుక మరో కోణం.. తప్పు పడుతున్న స్త్రీవాదులు

అందం పేరుతో జరుగుతోన్న వ్యాపారం కూడా విశ్వవ్యాప్తమైనదే. బ్లేడ్‌ దగ్గర్నుంచి, బడా బడా వ్యాపారాలన్నీ అందాల రాసులపై యాడ్స్‌పైనే ఆధారపడి జరుగుతున్నాయి. అది పక్కన పెడితే..

Beauty Pageants: అందాల పోటీలు కేవలం సౌందర్యపోటీలేనా.. దీనివెనుక మరో కోణం.. తప్పు పడుతున్న స్త్రీవాదులు
Miss Universe
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2021 | 10:20 PM

అందాల పోటీలు కేవలం సౌందర్యపోటీలుగానే మిగలడం లేదు. దీనివెనుక మరో కోణం వుంది. అదే వ్యాపారం. అందం చుట్టూ జరుగుతున్న కాస్మొటిక్‌ బిజినెస్‌ నేడు మోస్ట్‌ పవర్‌ఫుల్‌ బిజినెస్‌ అన్నది ఓపెన్‌ సీక్రెట్‌. కాస్మెటిక్ ప్రపంచంలో బ్యూటీ ఇండస్ట్రీ విలువ 26.85 బిలియన్ డాలర్లుందంటే అందాల పోటీల వెనుక అసలు కోణం అర్థం చేసుకోవచ్చు. అందం, అది సృష్టిస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. స్కూల్ పిల్లల నుండి అపార్ట్మెంట్ లో ఫంక్షన్ల దాకా ఫ్యాషన్ షో కల్చర్ పెరిగిపోయింది. ప్రతి టౌన్ కి ఒక ఫాషన్ షో. అపార్ట్‌మెంట్లలో ఫ్యాషన్‌ షోలు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఫ్యాషన్‌షోలదే హవా. కేవలం మిస్ మాత్రమే కాదు మిస్సెస్ లకు కూడా ఫాషన్ షోలు నేటి ట్రెండ్‌. ఇక ప్రెగ్నెంట్‌ లేడీస్ కి సైతం స్పెషల్‌ ఫ్యాషన్‌షోలు నిర్వహిస్తున్నారు. ఇక యువతులకే కాదు, పసిపిల్లలకు సైతం ఫ్యాషన్‌షోల విషసంస్కృతిని తీవ్రంగా తప్పు పడుతున్నారు స్త్రీవాదులు.

అందం పేరుతో జరుగుతోన్న వ్యాపారం కూడా విశ్వవ్యాప్తమైనదే. బ్లేడ్‌ దగ్గర్నుంచి, బడా బడా వ్యాపారాలన్నీ అందాల రాసులపై యాడ్స్‌పైనే ఆధారపడి జరుగుతున్నాయి. అది పక్కన పెడితే, అందం పేరుతో జరుగుతోన్న కాస్మొటిక్‌ బిజినెస్‌కి ప్రపంచ వాణిజ్య రంగంలో కీలక పాత్ర. సబ్బులు మొదలుకొని, కోట్ల రూపాయల విలువచేసే కాస్మొటిక్స్‌ వ్యాపారం విశ్వవ్యాప్తంగా విస్తరించివుంది.

అమెరికా నుంచి అనకాపల్లి వరకు బ్యూటీ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్‌ గత కొన్నేళ్లుగా అమాంతం పెరిగిపోయింది. గతంలో కేవలం పట్టణాలకూ, నగరాలకూ మాత్రమే పరిమితమైన బ్యూటీ పార్లర్లు ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే వేలం వెర్రిగా మారిపోయాయి.

దేశంలో వీధి వీధినా పెరుగుతున్న బ్యూటీ పార్లర్లుకు తోడు గత కొద్దిరోజులుగా ఇండియాలో సెలూన్‌ ఇండస్ట్రీ విపరీతంగా విస్తరిస్తోంది. ఇండియన్ సెలూన్ ఇండస్ట్రీ విలువ 100 బిలియన్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తన్నారు. ఇందులో 9% పైగా బిజినెస్ ఆన్లైన్ సేల్స్ ద్వారానే జరుగుతోందంటే బ్యూటీబిజినెస్‌ పవరేంటో అర్థం చేసుకోవచ్చు.

కాస్మెటిక్ ప్రపంచంలో బ్యూటీ ఇండస్ట్రీ విలువ 26.85 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 నుండి 2025 మధ్యకాలంలో 8.5% కు పైగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యే ఇండియన్ బ్యూటీ బ్రాండ్ నైకా ఓనర్ ఫోర్బ్స్ 100 లో నుంచుని ఇండియన్ బ్యూటీ మార్కెట్ ఎంత పెద్దదో చూపించారు.

బ్యూటీ బిజినెస్‌లో అగ్రరాజ్యం అమెరికాదే అగ్రభాగం. కాస్మొటిక్‌ వ్యాపారంలో 82.3 బిలియన్ డాలర్లతో అమెరికా టాప్‌లో నిలిచింది. ఇండియాలో మోడలింగ్ ఇండస్ట్రీ సైతం విపరీతంగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఫాషన్ ఇండస్ట్రీ కేవలం కొన్ని ఏజెన్సీస్ చేతుల్లోనే ఉంది.

ఇండియాలో మోడలింగ్ కోర్సులు అందించే కాలేజీలు సైతం ఉన్నాయంటే బ్యూటీ ఇండస్ట్రీ భవిష్యత్తుని అంచనా వేయొచ్చు. ఢిల్లీ లో ఆర్కే ఫిలిం అండ్ మీడియా అకాడెమి, మేహర్ భాసిన్ అకాడమీ, హైదరాబాద్ లో లుక్స్ మోడలింగ్ ఇన్స్టిట్యూట్ ఆ కోవకి చెందినవే.

ఫోటోగ్రాఫర్లు , ఫాషన్ డిజైనర్లు, మీడియా పర్సన్స్‌ లాంటి వారికి ఆన్లైన్ వేదికల మీద టాలెంట్ ప్రదర్శించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక మోడల్స్ ను ట్రైన్ చేసే వర్క్ షాపులు కూడా అందుబాటులోకి వచ్చాయి.

మరోవైపు బ్యూటీ కాంటెస్ట్‌లపై తీవ్రమైన విమర్శలు సైతం ఉన్నాయి. కేవలం తెల్లతోలు ఉంటేనే అందమంటూ ప్రచారం చేయడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం మీడియా పరమైన బ్యూటీ నిర్వచనం వల్ల బాడీ షేమింగ్ జరుగుతుందని 76% మంది భావిస్తున్నారు. 89% మంది సోషల్ మీడియాలో ఇతరుల అందానికి వచ్చే కామెంట్స్ చూసి తమను తాము అసహ్యించుకుంటున్నట్టు వెల్లడించారు.

ఫేస్ బుక్ ఎంప్లాయ్ ఫ్రాన్సిస్ హౌగెన్ బయటపెట్టిన విషయాలు సంచలనానికి తెరతీశాయి. ఇన్‌స్ట్రాగ్రామ్ తీసుకొచ్చిన బ్యూటీ స్టాండర్డ్స్ వివాదాస్పదంగా మారాయి. హీరోయిన్లు, ఆర్టిస్టులు, అందమైన ముఖాలను ఫిల్టర్లతో పెట్టడంతో యుక్తవయసులో ఉన్న ఆడపిల్లలు ఆత్మన్యూనతకు లోనౌతున్నట్టు వెల్లడించింది ఈ అధ్యయనం.

ఇవి కూడా చదవండి: CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..