Year Ender 2021: సవాళ్లను అధిగమించిన మోదీ సర్కార్ 2.0.. ఈ ఏడాది తీసుకున్న టాప్-9 నిర్ణయాలు ఇవే..

PM Narendra Modi govt key decisions: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి 2021 సంవత్సరం కొన్ని కఠినమైన సవాళ్లను విసిరింది. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా

Year Ender 2021: సవాళ్లను అధిగమించిన మోదీ సర్కార్ 2.0.. ఈ ఏడాది తీసుకున్న టాప్-9 నిర్ణయాలు ఇవే..
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2021 | 6:03 PM

PM Narendra Modi govt key decisions: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి 2021 సంవత్సరం కొన్ని కఠినమైన సవాళ్లను విసిరింది. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రారంభంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ఆతర్వాత తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, రైతుల నిరసన, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు లాంటివి ఉన్నాయి. అయితే.. ఏడాది పొడవునా సవాళ్లను ఎదుర్కొంటూనే మోదీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న టాప్ నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వ్యవసాయ చట్టాల రద్దు: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. రైతులు గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలిపారు. ప్రధానంగా పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టారు. మోడీ ప్రభుత్వం రైతులను ఒప్పించేందుకు ప్రయత్నించింది.. కానీ రైతులు, సంఘాలు దీనికి నిరాకరించారు. దీంతో ప్రధాని మోడీ నవంబర్ 19న తన ప్రభుత్వం చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో సంవత్సరం పాటు కొనసాగిన నిరసనలకు మోదీ ముగింపు పలికారు.

ఉచిత కోవిడ్-19 టీకాలు: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో విజృంభించింది. లక్షలాది మంది మహమ్మారి బారిన పడగా.. వేలాది మంది మరణించారు. ఈ క్రమంలో పరిస్థితిని నియంత్రించడానికి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా డ్రైవ్‌ను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వ్యాక్సిన్‌ల కొరత కారణంగా అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టీకా డ్రైవ్‌ను నిలిపివేశాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన ఏర్పడటంతో.. జూన్ 7న ప్రధాని మోదీ స్పందించారు. జూన్ 21 నుంచి అందరికీ ఉచిత వ్యాక్సిన్‌లను అందిస్తామని ప్రకటించారు. టీకా తయారీదారుల నుంచి 75 శాతం వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.

7 కొత్త రక్షణ సంస్థలు: 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (OFB) సంస్థలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏడు కార్పొరేట్ సంస్థలుగా మారుస్తామని ప్రధాని మోదీ అక్టోబర్‌లో ప్రకటించారు. ఈ చర్యతో తమ ప్రభుత్వం భారతదేశ రక్షణ రంగాన్ని ‘ఆత్మనిర్భర్’గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా మార్చడం.. ఆధునిక సైనిక పరిశ్రమను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. గత ఏడేళ్లలో ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ప్రభుత్వం ఎన్నో ఘనతలను సాధించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఎల్‌ఏసీ వెంబడి చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ: మోడీ ప్రభుత్వం జూలైలో కోవిడ్-19 సెకండ్ వేవ్, ఐటీ రూల్స్ 2021, రైతుల నిరసనలపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం.. మంత్రివర్గంలో అనేక మార్పులు చేసింది. డాక్టర్ హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రకాష్ జవదేకర్‌లతో సహా పలువురు అగ్ర నాయకులను మంత్రివర్గం నుంచి తొలగించింది. ఆ తర్వాత జూలై 7న, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. దీనిలో జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవియా, సర్బానంద సోనోవాల్ వంటి పలువురు ముఖ్య నాయకులను కేంద్ర మంత్రివర్గంలోకి ప్రవేశించారు.

గతి శక్తి మాస్టర్ ప్లాన్: 2021లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకమైన గతి శక్తి మాస్టర్ ప్లాన్‌ను రూ.100 లక్షల కోట్లతో ప్రకటించారు. ఇది సంపూర్ణ మౌలిక సదుపాయాలకు పునాది వేస్తుందని.. మన ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ప్రణాళిక స్థానిక తయారీదారులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయపడుతుందన్నారు. మౌలిక సదుపాయాలు, నిర్మాణం రంగంలో సమగ్ర విధానం లాంటి వాటికి గతిశక్తి జాతీయ ప్రణాళిక దిశానిర్దేశం చేస్తుంది.

IT రూల్స్ 2021: కేంద్రం ఫిబ్రవరి 25న కొత్త IT రూల్స్ 2021ని రూపొందించింది. OTT ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ పోర్టల్‌లకు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరిగా చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 5 మిలియన్లకు పైగా వినియోగదారులతో ఉన్న పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి నెలా నివేదికను ప్రచురించడం, వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడం లాంటి నిబంధనలను తప్పనిసరి చేసింది. అయితే ఈ నిర్ణయం కేంద్రం, కొన్ని డిజిటల్ పోర్టల్‌ల మధ్య ప్రతిష్టంభనకు దారితీసింది. కొత్త నిబంధనలు చట్టవిరుద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి అని పేర్కొన్నాయి. అయితే కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త చట్టాలను పాటించాల్సిందేనని.. ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు సూచించింది. దేశంలోని చట్టాన్ని అందరూ పాటించాలని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు: ఏడాది ప్రారంభం నాటినుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రేటు రూ.110 దాటగా.. డీజిల్ వంద మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రం నవంబర్ 3న కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5, రూ.10 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో వాహనదారులకు కాస్త ఊరట కలిగినట్లయింది.

ఫ్రీ రేషన్ స్కీమ్: కరోనాతో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో.. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (PMGKAY) పథకం కింద కేంద్రం ప్రజలకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ ఏడాది నవంబర్‌ వరకే అని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో మళ్లీ దీనిపై నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ స్కీమ్‌ను మరింత కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ స్కీమ్‌ (పీఎంజీకేఏవై) ను 2022 మార్చి నెల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో పుతిన్ పర్యటన: అమెరికా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డిసెంబర్లో ఆతిధ్యం ఇచ్చారు. దశాబ్ధాలుగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేవిధంగా ఇరు దేశాల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అణు, రక్షణ, ద్వైపాక్షిక చర్చలపై సంతకాలు చేయడంతోపాటు.. అంతర్జాతీయంగా చైనా, అమెరికా లాంటి దేశాలు అనుసరిస్తున్న వ్యవహారాలపై మోదీ, పుతిన్ చర్చించారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో సైతం ప్రసంగించారు. అంతర్జాతీయంగా భారత్ అన్ని దేశాలతో సఖ్యతతో మెలుగుతుందంటూనే పలు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, అణు, ద్వైపాక్షిక అంశాలపై ప్రసంగించారు.

Also Read:

Vishwanath Dham: కార్మికులపై పూల వర్షం.. తన కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ..

Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..