Tamilnadu: రెండు కిలోమీటర్లు నడిచి కార్యాలయానికి వస్తోన్న కలెక్టరమ్మ.. ఎందుకంటే..
జిల్లా ప్రథమ పౌరుడి హోదాలో కలెక్టర్‌కు ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలుంటాయి. ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక వాహన సదుపాయాలు కూడా ఉంటాయి. ఎక్కడా కాలు కింద పెట్టే అవసరం కూడా ఉండదు
జిల్లా ప్రథమ పౌరుడి హోదాలో కలెక్టర్‌కు ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలుంటాయి. ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక వాహన సదుపాయాలు కూడా ఉంటాయి. ఎక్కడా కాలు కింద పెట్టే అవసరం కూడా ఉండదు. అయితే తమిళనాడులోని అరియలూర్ జిల్లా కలెక్టర్ రమణ సరస్వతి మాత్రం కలెక్టర్ హోదా అన్న దర్పాన్ని పక్కనపెట్టారు. ఓ సామాన్యురాలిలా కలెక్టరేట్‌కు నడిచివెళ్తున్నారు. ఇదేదో ప్రజల్లో గుర్తింపు, పాపులారిటీ సంపాదించడానికి కాదు. ఆమె నిర్ణయం వెనక ఓ మంచి ఆలోచన ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి వారంలో ఓ రోజు ఇలా ఇంటి నుంచి ఆఫీస్‌కు నడిచి వెళ్తారట. వాహనాల వాడకాన్ని తగ్గిస్తే కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చంటున్న ఆమె సుమారు 2 కిలోమీటర్లు ఇలాగే నడుస్తారట.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రమణ సరస్వతి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆతర్వాత ఐఏఎస్ చదివి తమిళనాడు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. మొదటగా వేలూరు డివిజన్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారిగా సమర్థంగా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత తిరునెల్వేలి జిల్లాకు రెవెన్యూ అధికారిగా బదిలీ అయ్యారు. 2012 నుంచి 2017 వరకు జిల్లా జాయింట్ కమీషనర్, సివిల్ సప్లై, ఈపీడీస్ PDS అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2017- 2021 మధ్య కాలంలో జిల్లా జేడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్‌లోనే అరియలూరు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. కాగా పర్యావరణ పరిరక్షణ కోసం కలెక్టర్‌కు నడిచి వస్తోన్న ఆమె ప్రజలు కూడా వాహనాల వాడాకాన్ని తగ్గించాలని కోరుతోంది.
Also Read:
Year Ender 2021: సవాళ్లను అధిగమించిన మోదీ సర్కార్ 2.0.. ఈ ఏడాది తీసుకున్న టాప్-9 నిర్ణయాలు ఇవే..
Common Pipeline for Gas: సహజవాయువు రవాణా కోసం ఉమ్మడి గ్యాస్ పైప్‌లైన్.. కేంద్రం సన్నాహాలు