బాలీవుడ్‌లో థర్డ్‌ వేవ్‌ టెన్షన్‌.. కొంపముంచిన గెట్‌ టుగెదర్ పార్టీ.. కరణ్‌ జోహార్‌ ఇళ్లు సీజ్‌..

బాలీవుడ్‌లో కరోనా కల్లోలానికి.. కరణ్‌ జోహర్ ఇచ్చిన పార్టీనే కారణమని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైంది. పార్టీకి వచ్చిన వాళ్లందరి లిస్ట్ సేకరించింది. ముప్పై మందికి పైగా..

బాలీవుడ్‌లో థర్డ్‌ వేవ్‌ టెన్షన్‌.. కొంపముంచిన గెట్‌ టుగెదర్ పార్టీ.. కరణ్‌ జోహార్‌ ఇళ్లు సీజ్‌..
Karan Johar House Party
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 14, 2021 | 3:16 PM

Karan Johars Party: వైరస్‌ మూవీస్‌.. ఇది సినిమా టైటిల్‌ కాదు.. ఓ మూవీ యూనిట్‌కి డైరెక్టర్‌ కరణ్‌ జోహర్‌ ఇచ్చిన పార్టీలో వైరస్‌ ఎంట్రీతో పరేషాన్‌. కరోనా టెన్షన్‌ పోలేదు.. సందట్లో సడేమియాలా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలకలం రేపుతోంది. ఈ టైమ్‌లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది సెలబ్రిటీలు బాధ్యత మరిచారు. కరోనాను స్వాగతించి తిప్పలు కొనితెచ్చుకున్నారు. అసలేం జరిగింది..? మరోసారి కరోనా కల్లోలానికి కారణమేంటో తేలిపోయింది. ముంబై అధికారులు ఆదిలోనే దొరకబట్టేశారు. కరోనా కల్లోలానికి కేంద్రం ఎక్కడో తేల్చేశారు. డిసెంబర్‌ 8న కరణ్‌ జోహార్‌ ఇంట్లో గెట్‌ టుగెదర్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి ‘ఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ మూవీ యూనిట్‌‌ ఇచ్చిన గెట్ టుగెదర్ పార్టీలో సెలబ్రిటీలు హాజరయ్యారు. డైరెక్టర్‌ సొహైల్ ఖాన్‌ భార్య సీమా ఖాన్‌కు పాజిటివ్‌ అని తేలింది.

బాలీవుడ్‌లో కరోనా కల్లోలానికి.. కరణ్‌ జోహర్ ఇచ్చిన పార్టీనే కారణమని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైంది. పార్టీకి వచ్చిన వాళ్లందరి లిస్ట్ సేకరించింది. ముప్పై మందికి పైగా పార్టీకి హాజరైనట్టు ప్రాథమికంగా అంచనాకొచ్చింది. వారిలో సీమాఖాన్‌, కరీనా కపూర్‌, అమృతా అరోరాలకు పాజిటివ్‌గా తేలింది. ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతుండడంతో పార్టీకి హాజరైన వారిలో టెన్షన్ మొదలైంది.

కరీనా కపూర్‌, అమృతా ఆరోరాపై బీఎంసీ సీరియస్ అయింది. కరోనా రూల్స్‌ ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి అటెండైన తర్వాత ఎక్కడికి వెళ్లారు..? ఎవరెవర్ని కాంటాక్ట్‌ అయ్యారన్న ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. దీంతో వాళ్ల నివాసాలకు అధికారులు నోటీసులు అంటించారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లంతా కొవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని సజెస్ట్ చేశారు.

ప్రస్తుతానికి కరోనా బారినపడ్డ వాళ్లు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ ఆందోళన అంతా ప్రైమరీ కాంటాక్ట్‌పైనే.. ఈ చైన్‌ ఎంతవరకు విస్తరించింది..? వాళ్లంతా ఎక్కడున్నారు..? టెస్ట్‌లు చేయించుకున్నారా..? లేదంటే అందరిలాగే జనాల్లో తిరుగుతున్నారా అన్న దడ మొదలైంది.

ఓ వైపు థర్డ్‌ వేవ్‌ టెన్షన్‌.. మరోవైపు ఒమిక్రాన్‌ పరేషాన్‌.. ఈ క్రమంలో పార్టీలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా గుంపులుగా గుమికూడారు. కరోనా కల్లోలానికి కారణమయ్యారు. ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే ఇలా చేయడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి: మాస్క్‌ వెనకాల మైమరిపించే అందం.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

Lakhimpur Kheri Case: పక్కా ప్రణాళికతోనే ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న.. కేంద్రమంత్రి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..