Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్‌ వెనకాల మైమరిపించే అందం.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

మాస్క్‌తో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో పలు టాలీవుడ్‌ సినిమాల్లో నటించింది. చిరంజీవి, తారక్‌ లాంటి స్టార్స్‌ తో ఆడిపాడింది. ఆతర్వాత తమిళంతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

మాస్క్‌ వెనకాల మైమరిపించే అందం.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2021 | 3:45 PM

మాస్క్‌తో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో పలు టాలీవుడ్‌ సినిమాల్లో నటించింది. చిరంజీవి, తారక్‌ లాంటి స్టార్స్‌ తో ఆడిపాడింది. ఆతర్వాత తమిళంతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా ‘రేస్‌’ సినిమాతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏడేళ్ల క్రితం ఓ పారిశ్రామికవేత్తతో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె అప్పటి నుంచి సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉంటోంది. ఇద్దరు పిల్లల ఆలనాపాలనలో బిజీగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం అందుబాటులో ఉంటోందీ అందాల తార. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో నీటి అడుగున మెటర్నిటీ ఫొటోషూట్‌ తీయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆతర్వాత బేబీబంప్‌తో ట్రెక్కింగ్‌ చేసి, ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది ఈ భామ.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో ఎంతో హంగామా చేస్తుంది. తన హెల్త్‌, ఫిట్‌నెస్‌, వర్కవుట్‌ టిప్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇంతకీ ఈ అందాల తార ఎవరంటే.. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించిన సమీరా రెడ్డి. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో తారక్‌ నటించిన ‘నరసింహుడు’, ‘అశోక్‌’ సినిమాల్లో నటించింది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవితో ‘జై చిరంజీవ’ సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుని అలరించింది. సూర్యతో ఆమె నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ మంచి విజయం సాధించింది. ఇక బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేసి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంది. ఈరోజు (డిసెంబర్‌14) సమీరా పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినిమా తారలు, అభిమానులు, నెటిజన్లను ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: