AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Case: పక్కా ప్రణాళికతోనే ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న.. కేంద్రమంత్రి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు

SIT on Lakhimpur Kheri Case: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా

Lakhimpur Kheri Case: పక్కా ప్రణాళికతోనే ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న.. కేంద్రమంత్రి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు
Lakhimpur Kheri Case
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2021 | 3:02 PM

Share

SIT on Lakhimpur Kheri Case: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పర్యటనలో నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్‌ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్‌ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. రైతులు, విపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో కేంద్రం.. ఈ ఘటనపై సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్‌.. మంగళవారం కీలక విషయాలను వెల్లడించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెల్లడించింది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే న‌మోదైన‌ అభియోగాల‌ను మార్చాల‌ంటూ ఈ కేసు విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌మూర్తికి సిట్ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి కుమారుడు ఆశిశ్‌ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్‌ ఆ లేఖలో కోరింది.

కాగా.. లఖింపుర్‌లో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపైకి అక్టోబర్ 3న ఆశిశ్ మిశ్రా కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఆ ఘటనలో మొత్తం 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సైతం వైరల్‌ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరగా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.

Also Read:

Omicron: 90 నిమిషాల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ ఫలితాలు.. కొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన ఢిల్లీ పరిశోధకులు

Covid Vaccine: మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. సీరమ్ సీఈఓ కీలక కామెంట్స్..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?