Omicron: 90 నిమిషాల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ ఫలితాలు.. కొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన ఢిల్లీ పరిశోధకులు

Omicron: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాందోళనకు గురి చేస్తోంది. దీనిపై ఎన్నో పరిశోధనలు..

Omicron: 90 నిమిషాల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ ఫలితాలు.. కొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన ఢిల్లీ పరిశోధకులు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 14, 2021 | 2:17 PM

Omicron: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాందోళనకు గురి చేస్తోంది. దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఐఐటీ పరిశోధకుల బృందం 90 నిమిషాల్లోనే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే కొత్త వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్ష విధానాన్ని రూపొందించారు ఆర్‌టీపీసీఆర్‌ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కరోనా పరీక్షతో కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది.

తాజాగా ఢిల్లీ ఐఐటీకి చెందిన కుసుమా స్కూట్‌ ఆఫ్‌ బయాలాజికల్‌ సైన్సెస్‌ రాపిడి స్క్రీనింగ్‌ పరీక్షను డెవలప్‌ చేశారు. అయితే ఒమిక్రాన్‌లో వేరియంట్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు పరిశోధకులు. కొత్తగా రూపొందించిన విధానం ద్వారా ఒమిక్రాన్‌ను త్వరగా గుర్తించవచ్చని చెబుతున్నారు.గతంలో కరోనాను త్వరగా గుర్తించేందుకు పీసీఆర్‌ ఆధారిత పరీక్షను ఐఐటీ రూపొందించింది. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే తొందరగా ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Omicron Variant: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌.. ఇప్పటి వరకే ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్కువగా వీరికే సోకుతుంది.. తాజా పరిశోధనలో వెల్లడి..!