AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR – CM Stalin: తాజా రాజకీయాలపై ఇద్దరు నేతల భేటీ.. కలిసి పోరాటం నిర్ణయం..

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రాల హక్కులపై కలిసి పోరాటం చేయాలని కేసీఆర్‌, స్టాలిన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

CM KCR - CM Stalin: తాజా రాజకీయాలపై ఇద్దరు నేతల భేటీ.. కలిసి పోరాటం నిర్ణయం..
Ktr With Udhayanidhi Stalin
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2021 | 10:12 PM

Share

KTR – Stalin’s son Udhayanidhi: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రాల హక్కులపై కలిసి పోరాటం చేయాలని కేసీఆర్‌, స్టాలిన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. చెన్నైలో స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు టీఆర్‌ఎస్‌ అధినేత. యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని స్టాలిన్‌ను ఆహ్వానించారు కేసీఆర్‌. కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం నివాసానికి విచ్చేశారు కేసీఆర్‌. దేశరాజకీయాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులను సాదరంగా ఆహ్వానించారు స్టాలిన్‌. గంటసేపు ఇద్దరు నేతల మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి.

అదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ .. స్టాలిన్‌ కుమారుడు , డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధితో భేటీ అయ్యారు. ఇద్దరు యువనేతలు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని , ఈవిషయంపై స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు జరుపుతారని కూడా టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల హక్కులను కాపాడుకునే విషయంతో తమిళనాడు సీఎంతో కలిసి పనిచేయాలన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యహరిస్తోందని స్టాలిన్‌ కూడా తరచుగా చెబుతున్నారు. సోమవారం తమిళనాడు లోని శ్రీరంగం ఆలయాన్ని సందర్శించారు కేసీఆర్‌. రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

తమిళనాట డీఎంకే , అన్నాడీఎంకే పార్టీలు ద్రవిడవాదాన్ని దశాబ్దాల నుంచి బలంగా విన్పిస్తున్నాయి. ఈ రెండు పార్టీల నిర్మాణాన్ని కూడా సీఎం కేసీఆర్‌ తన పర్యటనలో పరిశీలించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను డీఎంకే లాగా సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ఆలోచనలో కూడా కేసీఆర్‌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ

భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామిజీ పిలుపు