Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: వంద రూట్లలో ప్రైవేట్ రైళ్ళు.. టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వ సన్నాహాలు!

భారత ప్రభుత్వం మరోసారి ప్రైవేట్ రైళ్లను నడపాలనే ప్రతిపాదనను తీసుకురానుంది. ఈ ప్రతిపాదనపై ప్రైవేట్ కంపెనీల నుంచి బిడ్స్ కోరనున్నారు.

Indian Railways: వంద రూట్లలో ప్రైవేట్ రైళ్ళు.. టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వ సన్నాహాలు!
Sankranti Special Trains
Follow us
KVD Varma

|

Updated on: Dec 14, 2021 | 9:40 PM

Indian Railways: భారత ప్రభుత్వం మరోసారి ప్రైవేట్ రైళ్లను నడపాలనే ప్రతిపాదనను తీసుకురానుంది. ఈ ప్రతిపాదనపై ప్రైవేట్ కంపెనీల నుంచి బిడ్స్ కోరనున్నారు. గత సంవత్సరం కూడా, ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేసింది, అయితే కరోనా కారణంగా కంపెనీలు తక్కువ ఆసక్తి చూపడంతో, ప్రతిపాదన విజయవంతం కాలేదు. దాన్ని ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకువస్తున్నారు. ఇందుకోసం దేశంలోని 100 మార్గాల్లో ప్రైవేట్ రైళ్లను నడపవచ్చని రైల్వేశాఖ గుర్తించింది.

నివేదిక ప్రకారం, దేశంలోని దాదాపు 100 గుర్తించబడిన మార్గాల్లో ప్రైవేట్ రైళ్లను నడపడానికి వేలం ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తారు. దీని పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రైల్వేశాఖ భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసి, దాని కింద ప్రయివేటు కంపెనీల ద్వారా రైలును నడిపించడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టే విధంగా పెట్టుబడిదారుల సౌకర్యార్థం రైల్వే విధానం రూపొందుతోంది. మూలాల ప్రకారం, కొత్త ఆర్థిక సంవత్సరం నుండి 150 రైళ్లను వేలం వేయనున్నారు.

ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది

ప్రభుత్వం మునుపటి ప్రయత్నంలో, ప్రైవేట్ కంపెనీలు తమ ఆసక్తిని ప్రదర్శించలేదు. ఈ కారణంగా ఈ సంవత్సరం నవంబర్‌లో ఆ పథకాన్ని రద్దు చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రక్రియను కొత్తగా ప్రారంభించబోతోంది. ప్రైవేట్ రైళ్లను నడపగల 100 మార్గాలను కూడా రైల్వే గుర్తించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం, రైల్వేలు, ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ 70 వేల కోట్లకు పైమాటే.

రెవెన్యూ షేరింగ్ మోడల్

రెవెన్యూ షేరింగ్ మోడల్‌పై కంపెనీలు, రైల్వేల మధ్య చర్చ జరుగుతోంది. రైళ్ల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని రైల్వేలు.. కంపెనీల మధ్య ఎలా విభజించాలనే దానిపై వివరంగా చర్చ జరుగుతోంది. మునుపటి ప్రణాళికలో, ఈ అంశంపై ప్రైవేట్ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మూలాధారాలను ఉటంకిస్తూ ఈ నివేదికను అందించారు. మూలాల ప్రకారం, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి వేలం ప్రక్రియ ప్రారంభించవచ్చు. 100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వేలంలో బిడ్‌ను గెలుచుకున్న కంపెనీ రైలును నిర్దిష్ట మార్గంలో నడపడానికి అనుమతిస్తారు. ఈ 100 రూట్లను గతసారి కూడా గుర్తించినవే. కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, చేయబోయే కొత్త ప్రతిపాదనల్లో భవిష్యత్తు బడ్జెట్‌ గురించి కూడా ప్రస్తావన ఉంటుందని ‘మింట్’ నివేదిక పేర్కొంది.

గతేడాది 30000 కోట్ల టెండర్లు వేశారు

గతేడాది జులైలో ప్రైవేట్‌ కంపెనీలకు రైల్వే శాఖ రూ.30,000 కోట్ల టెండర్‌ వేసింది. ఇందులో 109 జతల రైళ్లను చేర్చారు. వీటిని ఆపరేటింగ్ కోసం ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలి. ఈ టెండర్‌ను 12 క్లస్టర్లుగా విభజించారు. 12 క్లస్టర్లకు గాను 15 కంపెనీల నుంచి 120 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐఆర్‌సిటిసి.. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుండి కేవలం మూడు క్లస్టర్‌లు మాత్రమే ఆర్థిక బిడ్‌లను అందుకున్నాయి. ప్రైవేట్ రైళ్లను నడపడానికి ప్రారంభ ఆసక్తిని చూపిన కంపెనీలలో IGMR హైవేస్, IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & డెవలపర్స్, క్యూబ్ హైవేస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. ఛార్జీలు.. రూట్‌ల గురించి కంపెనీలు ఆందోళన చెందుతున్నాయని, ఛార్జీలు, రేక్ ఛార్జీలు.. రాయితీ వ్యవధిపై స్పష్టమైన నిబంధనలు కావాలని అధికారులు మింట్‌కి తెలిపారు, తద్వారా ఎటువంటి సమస్య ఉండదని కంపెనీలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Success Story: ఒక్క మహిళ.. వెయ్యిరూపాయల పెట్టుబడి.. ఏడేళ్ళు.. కోట్లాది రూపాయల సంపాదన.. ఎలా అంటారా..ఇదిగో ఇలా..!

Chardham Road Project: సైనికుల కోసం ఇది తప్పనిసరి.. చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు ఆమోదం.