Actor Sunil: విలన్‌గా నటించాలనే కోరిక ఇన్నాళ్లకు తీరింది.. ఏ టైప్ పాత్రలు ఏ భాషలో వచ్చినా చేస్తా: సునీల్

Actor Sunil: యాక్టర్ సునీల్ ముందు మంచి డ్యాన్సర్ కావాలనుకుని హైదరాబాద్ వచ్చాడు. స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సలహాతో నటుడిగా సినిమాల్లో ప్రయత్నించి ....

Actor Sunil: విలన్‌గా నటించాలనే కోరిక ఇన్నాళ్లకు తీరింది.. ఏ టైప్ పాత్రలు ఏ భాషలో వచ్చినా చేస్తా: సునీల్
Sunil
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2021 | 12:44 PM

Actor Sunil: యాక్టర్ సునీల్ ముందు మంచి డ్యాన్సర్ కావాలనుకుని హైదరాబాద్ వచ్చాడు. స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సలహాతో నటుడిగా సినిమాల్లో ప్రయత్నించి .. హాస్యనటుడిగా , హీరోగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాడు. తాజగా సునీల్ .. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాతో మరో రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సునీల్ వర్మ .. జెడి చక్రవర్తి హీరోగా నటించిన పాపే నా ప్రాణం సినిమాలో వెయిటర్ గా ఒక చిన్న పాత్రలో టాలీవుడ్ లో అడుగు అడుగు పెట్టాడు. అనంతరం నువ్వేకావాలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమాకు గోదావరి యాసతో మాట్లాడే హాస్య నటుడిగా బెస్ట్ ఆప్షన్ అయ్యాడు. నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు వంటి అనేక సినిమాల్లో హాస్యనటుడిగా అలరిస్తూనే అందాల రాముడు,  మర్యాదరామన్న వంటి అనేక సినిమాల్లో హీరోగా నటించాడు. సుమారు 200 సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన సునీల్ తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లో విలన్ గా చేస్తున్నాడు. ఇదే విషయంపై సునీల్ స్పందిస్తూ.. తన క్యారెక్టర్ పేరు మంగళం శీను అని చెప్పాడు. పూర్తి  నెగెటివ్ క్యారెక్టర్ … ఇంకా చెప్పాలంటే తన జీవితంలో ఒక పది సంవత్సరాలు పెద్ద వయస్సు క్యారెక్టర్ చేశానని అన్నారు. తాను ఇండస్ట్రీ కి వచ్చింది విలన్ గా నటిద్దామని.. అయితే ఇప్పటికి తాను విలన్ గా నటించినట్లు చెప్పారు. ఈ సినిమాలోని నా  క్యారెక్టర్ గురించి సుకుమార్ కరోనా కు ముందు చెప్పారని.. తన పాత్రకు తాను న్యాయం చేసినట్లు భావిస్తున్నట్లు సునీల్ తెలిపారు. పుష్ప సినిమాలో అందరూ నాచురల్ గా నటిస్తున్నారు..నేను డ్రమాటిక్ గా చేస్తే నేచురల్ మిస్సవుతుంది అనుకొని నేచురల్ గానే నటించానని తెలిపారు.  ఒక సందర్భంలో మల్టిపుల్ తింగ్స్ ప్లే అవుతు వుంటాయి..  సుకుమార్ అందరినీ పాత్రలకు తగ్గట్టు ప్రిపేర్ చేసి చేయించాడని తెలిపారు. అడవిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు ఏ ఫోన్ కాల్ రాకూడదని కోరుకునేవాడినని.. తెలిపారు.  సినిమా అంటే పేషన్ వుంటేనే కానీ మైత్రి వారు ఈలాంటి సినిమాలు చేయరని .. తాను ఒకే టైప్ పాత్రలు చేయాలని అనుకోవడంలేదని.. తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా ఛాలెంజ్ గా తీసుకుని నటిస్తానని చెప్పారు. అంతేకాదు తెలుగులోనే కాదు.. ఏ భాషలోనైనా తాను నటిస్తానని సునీల్ చెప్పారు.

Also Read: సుధీర్ బాబు నా పాత్రలో నటించడానికి బెస్ట్ ఆప్షన్.. మేమిద్దరం మంచి స్నేహితులమన్న గోపీచంద్..