Puneeth Rajkumar: త్వరలోనే సాకారం కానున్న పునీత్‌ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి రాజ్‌కుమార్‌ పూరిల్లు..

కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు కన్నడ ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్

Puneeth Rajkumar: త్వరలోనే సాకారం కానున్న పునీత్‌ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి రాజ్‌కుమార్‌ పూరిల్లు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 11:09 AM

కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు కన్నడ ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్. సినిమా రంగంలో ఎంతో భవిష్యత్‌ ఉందనుకున్న అతని ఆకస్మిక మరణం భారతీయ సినిమా పరిశ్రమను బాగా కలిచి వేసింది. అయితే మరణానికి ముందే తన తండ్రి సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌, పూర్వీకులు నివసించిన గాజానూర్‌లోని ఇంటిని మ్యూజియంగా మార్చాలని పునీత్‌ భావించారు. ఈ ఏడాది ఆగస్టులో భారీ వర్షాలు పడడంతో ఆ ఇల్లు చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆ ఇంటిని అందంగా పునరుద్ధరించి ఓ మ్యూజియంగా మార్చాలనుకున్నాడు పవర్‌స్టార్‌. ఇందులో భాగంగా చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఇంటిని సందర్శించి తగిన ప్రణాళికలు రెడీ చేసుకున్నాడే. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

తాజాగా పునీత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు రాజ్‌కుమార్‌ మేనల్లుడు గోపాల్‌ ముందుకొచ్చాడు. శిథిలమైన ఇంటిని శరవేగంగా పునరుద్ధరించే పనిలో పడ్డారు. పనులు వేగంగా జరుగుతున్నాయని మరో రెండు నెలల్లో ఈ ఇల్లు రిన్నోవేషన్‌ పూర్తవుతుందని ఆయన చెబుతున్నాడు. కాగా పునీత్ సోదరులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కూడా త్వరలోనే ఈ ఊరిని సందర్శిస్తారని గోపాల్‌ తెలిపారు. ‘ గాజానూర్‌లోనే డాక్టర్‌ రాజ్‌కుమార్‌ నటజీవితం ప్రారంభమైంది. ఈ ఊరితో ఆయనకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. అలాంటి ఇల్లు శిథిలావస్థలో ఉండిపోవడం నన్ను బాగా కలచివేసింది. అందుకే పునరుద్ధరణ పనుల బాధ్యత తీసుకున్నాను. పనులు పూర్తి కాగానే డాక్టర్ రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, వారి కుటుంబ సభ్యుల అరుదైన ఫొటోలను గోడలపై పెడతాను’ అని గోపాల్‌ చెప్పుకొచ్చారు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!