Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harnaaz Sandhu: త్వరలోనే వెండితెరపై మిస్‌ యూనివర్స్‌! అప్పుడే రెండు సినిమాలకు సైన్‌!

సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ కిరీటం దక్కేలా చేసింది హర్నాజ్‌ సంధూ. తన అందం, అంతకుమించిన తెలివితేటలతో సుస్మితా సేన్‌

Harnaaz Sandhu: త్వరలోనే వెండితెరపై మిస్‌ యూనివర్స్‌! అప్పుడే రెండు సినిమాలకు సైన్‌!
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 2:23 PM

సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ కిరీటం దక్కేలా చేసింది హర్నాజ్‌ సంధూ. తన అందం, అంతకుమించిన తెలివితేటలతో సుస్మితా సేన్‌, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్‌గా గుర్తింపు పొందింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఇజ్రాయెల్‌ వెళ్లిన హర్నాజ్‌ 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మరీ ‘మిస్ యూనివర్స్ 2021’ సొంతం చేసుకుంది. దీంతో చాలామంది ఆమె గురించి తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ లాంటి అందాల పోటీల్లో సత్తాచాటిన వారందరూ సిల్వర్‌స్ర్కీన్‌పై అడుగపెడతారు. ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారాదత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్‌ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు.

అయితే సినిమాల విషయంలో హర్నాజ్‌ కొంచెం అడ్వాన్స్ డ్‌ గానే ఉందని తెలుస్తోంది. మిస్‌ యూనివర్స్‌ పోటీలకు వెళ్లేముందే ‘పోలీవుడ్‌( పంజాబీ చిత్ర పరిశ్రమ)లో తన మొదటి సినిమాకు సైన్‌ చేసిందట. ‘బాయి జీ కుట్టంగే’ అనే సినిమాలో పంజాబీ సీనియర్‌ నటి ఉపాసనా సింగ్‌ కుమారుడు నానక్‌ తో ఆమె స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుందట. ఉపాసనా సింగ్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఇప్పటికే చాలావరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2022 మే 27న ప్రేక్షకుల ముందుకు రానుందట. కాగా దీంతో పాటు ‘యారన్ దియాన్ పో బారా’ అనే పంజాబీ సినిమాకు కూడా హర్నాజ్‌ అంగీకారం తెలిపిందట. ఇందులో కూడా నానకే హీరోగా నటిస్తున్నాడట. కాగా మిస్‌యూనివర్స్‌గా నిలిచిన సంధూపై అభినందనల వర్షం కొనసాగుతోంది. తాజాగా మాజీ విశ్వసుందరి లారాదత్తా సోషల్‌ మీడియా వేదికగా ‘మిస్‌ యూనివర్స్‌ క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ అభినందనలు తెలిపింది.

Unstoppable with NBK: బాలయ్య టాక్‌షోకు తదుపరి చీఫ్‌ గెస్టులు వీరే..

Puneeth Rajkumar: త్వరలోనే సాకారం కానున్న పునీత్‌ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి రాజ్‌కుమార్‌ పూరిల్లు..

Victrina: పెళ్లికి ముందే పంజాబీ నేర్చుకుంది.. ఆ మూడు రోజులు ఒక ముక్క కూడా ఇంగ్లిష్‌ మాట్లాడలేదు.. క్యాట్‌ గురించి విక్కీ కజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!