AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: డయాబెటిస్‌ అదుపులో ఉండాలా..? మధ్యాహ్నం సమయంలో ఈ ఐదు ఆహారాలు చేర్చడం ముఖ్యం..!

Diabetes Diet: ప్రస్తుతం మధుమేహం వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. డయాబెటిస్‌ ఉన్నవారు రోజువారీ ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది...

Diabetes Diet: డయాబెటిస్‌ అదుపులో ఉండాలా..? మధ్యాహ్నం సమయంలో ఈ ఐదు ఆహారాలు చేర్చడం ముఖ్యం..!
Subhash Goud
|

Updated on: Dec 15, 2021 | 6:39 PM

Share

Diabetes Diet: ప్రస్తుతం మధుమేహం వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. డయాబెటిస్‌ ఉన్నవారు రోజువారీ ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది. లేకపోతే షుగర్ లెవల్స్‌ పెరిగి మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్‌ వచ్చిన వారు జీవనశైలిని మార్చుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు.

ఆకు కూరలు: డయాబెటిస్‌ ఉన్నవారు మధ్యాహ్న భోజనం సమయంలో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతికూర, బతువా, బ్రోకలీ, గోరింటాకు, తోరాయి, చేదుకాయ వంటివి తినవచ్చు. వీటిలో తక్కువ కెలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చ కూరలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. గుండె, కంటికి ఎంతోగానో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్‌-సి ఉంటుంది. ఇది టైప్‌-2 డయాబెటిస్‌ రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెంచేలా చేస్తాయి.

తృణధాన్యాలు-పప్పులు: మధుమేహం బారిన పడిన వారు రోజువారీ భోజనంలో ఎక్కువ పప్పులను చేర్చడం ఎంతో మంచిది. పప్పులు శరీరానికి ప్రోటీన్స్‌ పుష్కలంగా అందుతాయి. ఇందులో పోటాషియం, ఫైబర్‌, ఇతర పోషకాలు సమృద్దిగా ఉంటాయి. గోధుమ రొట్టే బదులుగా ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌, బ్రౌన్‌ రైస్‌, బార్లీ తీసుకోవడం మంచిది.

గుడ్డు: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఆహారంలో గుడ్డును చేర్చడం మంచిది. ప్రతి రోజు ఒక గుడ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అన్ని అమైనో ఆమ్లాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. రోజు గుడ్డు తినడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ వారికి ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.

పెరుగు : మధ్యాహ్న భోజనం సమయంలో పెరుగును చేర్చడం ఎంతో మంచిది. డయాబెటిస్‌ ఉన్నవారికి కూడా పెరుగుతో ఎంతో మంచిది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పెరుగు బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తి పెంచడంలో ఉపయోగపడుతుంది.

ఫ్యాటీ ఫిష్‌: మీరు నాన్‌వేస్‌ తింటే మధ్యాహ్నం ఆహారంలో ఫ్యాటీ ఫిష్‌ చేర్చుకోవడం మంచిది. సార్టినెస్‌, హెర్రింగ్‌, సాల్మన్‌ చేపలను కూడా తినవచ్చు. మధుమేహంతో బాధపడుతున్నవారికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చేపలు ఎక్కువగా తినడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Bone Weakness: బలహీనంగా ఉన్న ఎముకలను దృఢంగా మారాలంటే ఈ పదార్థాలను తీసుకోవాల్సిందే..!

తల్లిదండ్రులకు హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు చాలా ప్రమాదం..

మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే