Sara Ali Khan: నేనూ తప్పులు చేశాను.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ గురించి పట్టించుకోను.. సారా ఆసక్తికర వ్యాఖ్యలు..

సోషల్‌ మీడియా వాడకంతో ప్రయోజనాలున్నాయో అన్నే ప్రతికూలతలున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో సామాజిక

Sara Ali Khan: నేనూ తప్పులు చేశాను.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ గురించి పట్టించుకోను.. సారా ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 2:15 PM

సోషల్‌ మీడియా వాడకంతో ప్రయోజనాలున్నాయో అన్నే ప్రతికూలతలున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొందరు నెటిజన్లు వీరిని అదేపనిగా నెగెటివ్‌ కామెంట్లు, అసభ్యకర వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతుంటారు. ట్రోలింగ్‌ చేస్తుంటారు. దీంతో చాలామంది తారలు కుంగుబాటుకు, ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. మరికొందరు ఈ ప్రతికూల కామెంట్లను పట్టించుకోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు వెళుతుంటారు. తాను కూడా ఈ రెండో జాబితాకే చెందుతానంటోంది బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌. సైఫ్‌ అలీఖాన్‌ తనయురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోందీ స్టార్‌ కిడ్‌. ‘కేదార్‌నాథ్‌’, ‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌కల్‌2’, ‘కూలీ నం.1’ చిత్రాలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘అత్రంగి రే’ అనే సినిమాలో నటిస్తోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌, కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ‘జీ5’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న సారా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను నా మూడ్స్‌ని చూపించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తుంటాను. అంతేకానీ, వాటికి నా మూడ్స్‌ని నియంత్రించే అవకాశం ఇవ్వను. నచ్చితే పోస్ట్‌ పెడతాను. లేకుంటే లేదు. సామాజిక మాధ్యమాల్లో నాపై వచ్చే నెగెటివ్‌ కామెంట్లు, ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోను. నేను నిజాయతీగా ఉండాలనుకుంటాను. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. గతంలో నేను చాలా తప్పులు చేశాను. అయితే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకొచ్చింది సారా.Also Read:

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్‌.. ఆదిపురుష్‌ టీంకు సర్ ప్రైజ్ గిఫ్ట్స్‌..

Pushpa : ఉర్రూతలూగిస్తోన్న సమంత స్పెషల్‌ సాంగ్‌.. షేక్‌ అవుతోన్న యూట్యూబ్‌ రికార్డ్స్‌..

Ganapath: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న ప్రముఖ దక్షిణాది నటుడు.. టైగర్‌తో కలిసి స్ర్కీన్‌ షేరింగ్‌..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..