AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలసట, ఒళ్లు నొప్పులు భరించలేకపోతున్నారా..! ఈ రెండు డ్రింక్స్‌ మీకు సరైన పరిష్కారం..

Body Pain: డెస్క్ జాబ్స్ చేసే వారు చాలా గంటలు ఒకే చోట కూర్చుని పని చేయాల్సి ఉంటుంది. చాలా సార్లు ఈ వ్యక్తులకు ఆహారం తినడానికి కూడా

అలసట, ఒళ్లు నొప్పులు భరించలేకపోతున్నారా..! ఈ రెండు డ్రింక్స్‌ మీకు సరైన పరిష్కారం..
Work From Home
uppula Raju
|

Updated on: Dec 17, 2021 | 7:33 AM

Share

Body Pain: డెస్క్ జాబ్స్ చేసే వారు చాలా గంటలు ఒకే చోట కూర్చుని పని చేయాల్సి ఉంటుంది. చాలా సార్లు ఈ వ్యక్తులకు ఆహారం తినడానికి కూడా సమయం ఉండదు. అందుకే వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. డెస్క్ జాబ్స్ కోసం నిరంతరాయంగా పనిచేసే వారిని ఊబకాయం, పొట్ట కొవ్వు పెరగడమే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు చుట్టుముడుతాయి. అంతేకాదు ఈ వ్యక్తులు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

అయితే కరోనా కారణంగా చాలా మంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. దీని కారణంగా ప్రజలు మరింత శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి పనిలో నిరంతరం కూర్చోవడం వల్ల పొట్ట సమస్యలతో పాటు, శరీర నొప్పి సమస్య కూడా ప్రజలలో పెరుగుతోంది. వర్క్‌ ఫ్రం హోంలో పని పెరిగి ఉండవచ్చు. నిరంతరం కూర్చొని పని చేయడం వల్ల భుజం నొప్పి, నడుం నొప్పి, బాడీ పెయిన్ వంటి సమస్యలు బాగా పెరిగాయి. రోజువారీ జీవితంలో ఉపయోగించే శరీర నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం.

1. అల్లం టీ అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి బయటపడటానికి, జలుబు, సీజనల్‌ వ్యాధులు, శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ తాగాలి. మీరు శరీర నొప్పితో బాధపడుతుంటే అల్లం టీ లేదా అల్లం డికాక్షన్ తాగాలి. దీంతో నొప్పి తక్కువగా ఉంటుంది అలాగే మీ పనిని ప్రారంభించడం సులభం అవుతుంది. అల్లం డికాషన్ నొప్పికి చాలా మేలు చేస్తుంది.

2. బంగారు పాలు పసుపు పాలు తరచుగా భారతదేశంలోని ఇళ్లలో తాగుతారు. ఇది అనేక సమస్యలకు దివ్యౌషధంగా చెబుతారు. అందుకే దీన్ని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. మీరు ఇంటి నుంచి పనిలో అలసట, శరీర నొప్పితో బాధపడుతుంటే రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు పొడిని కలుపుకొని తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది.

కను రెప్పల అందానికి ప్రయత్నిస్తే కళ్లకే ప్రమాదం..! మహిళలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

తల్లిదండ్రులకు హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు చాలా ప్రమాదం..