AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్క్ చాక్లెట్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా..! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..

Dark Chocolate Coffee: ఒక కప్పు కాఫీ మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. మీకు డార్క్ చాక్లెట్ అంటే ఇష్టం ఉంటే దీంతో తయారు చేసిన కాఫీని

డార్క్ చాక్లెట్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా..! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..
Dark Chocolate
uppula Raju
|

Updated on: Dec 17, 2021 | 8:54 AM

Share

Dark Chocolate Coffee: ఒక కప్పు కాఫీ మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. మీకు డార్క్ చాక్లెట్ అంటే ఇష్టం ఉంటే దీంతో తయారు చేసిన కాఫీని కూడా తాగవచ్చు. ఇది నిమిషాల్లో తయారు చేయవచ్చు. దీన్ని చేయడానికి మీకు కొన్ని పదార్థాలు మాత్రమే అవసరమవుతాయి. శీతాకాలంలో ఎంతో రుచిగా ఆస్వాదించవచ్చు. ఇష్టమైన వారికి చేసి ఇవ్వొచ్చు.

కావలసిన పదార్థాలు 1. కాఫీ – 2 షాట్స్ 2. తేనె – 2 టేబుల్ స్పూన్లు 3. హెవీ క్రీమ్ – 1 కప్పు 4. డార్క్ చాక్లెట్ – 1 కప్పు 5. కోకో పౌడర్ – 1 టీస్పూన్

ఎలా తయారు చేయాలి..?

1. డార్క్ చాక్లెట్‌ను కరిగించండి ఈ క్లాసిక్ కాఫీ రెసిపీని తయారు చేయడానికి మొదటగా ఒక పాన్ తీసుకొని దానిపై డార్క్ చాక్లెట్ క్యూబ్స్ కరిగించండి. అందులో కోకో పౌడర్ కలపండి.

2. మిశ్రమాన్ని సిద్ధం చేయండి కోకో పౌడర్, కరిగించిన చాక్లెట్ బాగా కలపాలి. హెవీ క్రీమ్‌తో 2 కాఫీ షాట్‌లను జోడించండి. మిశ్రమాన్ని 3-4 నిమిషాలు ఉడకబెట్టండి. అది మెత్తగా మందంగా అవుతుంది.

3 వేడిగా వడ్డించండి ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన కప్పులో పోసి 1 టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. అంతే వేడిగా వడ్డించండి.

4. మీరు మీ కాఫీని కొంచెం తియ్యగా చేయాలనుకుంటే పానీయాన్ని ఉడకబెట్టేటప్పుడు అందులో చక్కెరను కలుపవచ్చు.

డార్క్ చాక్లెట్ ప్రయోజనాలు అనేక అధ్యయనాల ప్రకారం చాక్లెట్‌ను తగినంత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది గుండెపోటు రాకుండా నివారిస్తుంది. చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్, కోకో ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దృష్టి, శ్రద్ధ, జ్ఞాపకశక్తి స్థాయిని మెరుగుపరుస్తుంది. BP తక్కువగా ఉంటే, నీరసంగా ఉన్నట్లయితే మీరు చాక్లెట్ తినవచ్చు. ఇది మీ శక్తి స్థాయిని పెంచుతుంది. ఇందులో కొంత మొత్తంలో కెఫిన్, థియోబ్రోమిన్ ఉంటాయి. ఇది మీ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఈ నటుడు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాడు.. అతడి కొడుకు ఇప్పుడు సూపర్‌ స్టార్..

జాన్‌ అబ్రహం హీరో కాకముందు ఏం చేసేవాడో తెలుసా..? నేడు అతనొక బాలీవుడ్‌ సూపర్ స్టార్‌..

అంపైర్‌ని చంపేస్తానని బెదిరించాడు.. కెరీర్‌ సర్వనాశనం చేసుకున్నాడు.. ఎవరో తెలుసా..?