Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌ నుంచి వచ్చి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాడు.. అతడి కొడుకు ఇప్పుడొక సూపర్‌ స్టార్..

Suresh Oberoi: బాలీవుడ్ నటుడు సురేష్ ఒబెరాయ్ ఒకప్పుడు ప్రముఖ నటులలో ఒకరు. వీరు ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆ కాలంలోని

పాకిస్తాన్‌ నుంచి వచ్చి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాడు.. అతడి కొడుకు ఇప్పుడొక సూపర్‌ స్టార్..
Suresh Oberoi
Follow us
uppula Raju

|

Updated on: Dec 17, 2021 | 8:27 AM

Suresh Oberoi: బాలీవుడ్ నటుడు సురేష్ ఒబెరాయ్ ఒకప్పుడు ప్రముఖ నటులలో ఒకరు. వీరు ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆ కాలంలోని సూపర్‌స్టార్లందరిలో నటించారు. క్లాసిక్ నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉత్తమ నటనకు గానూ జాతీయ అవార్డు అందుకున్నారు. ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. తన సినీ కెరీర్‌లో అతను ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రనే పోషించారని అందరు అంటారు. అయితే సురేష్ ఒబెరాయ్ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే జన్మించారు. అప్పుడు దేశ విభజన జరగలేదు. అతను1946 డిసెంబర్ 17న బలూచిస్థాన్‌లోని క్వెట్టాలో పంజాబీ ఖత్రీ హిందూ కుటుంబంలో జన్మించారు.

అతని తండ్రి పేరు ఆనంద్ సరూప్ ఒబెరాయ్, తల్లి పేరు కర్తార్ దేవి. 1947లో దేశం విడిపోయింది ఆ తర్వాత అతని కుటుంబం భారతదేశానికి వచ్చింది. తర్వాత అతని కుటుంబం మొదట పంజాబ్‌లో నివసించడం ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. సురేష్ ఒబెరాయ్ చదువు కంటే క్రీడలపైనే ఎక్కువ ఆసక్తి చూపారు. టెన్నిస్, స్విమ్మింగ్‌లో ఎన్నో పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచారు. సురేష్ బాల్యం కష్టాల్లోనే గడిచింది. కానీ అతనికి నటనపై ప్రత్యేక ప్రేమ ఉంది. అతను హైస్కూల్ చదువుతున్నప్పుడు అతని తండ్రి మరణించారు. ఇదిలావుండగా నటనపై ఉన్న మక్కువతో ముంబైని ఆశ్రయించి చిత్రసీమలోకి అడుగుపెట్టారు.

సురేష్ ఒబెరాయ్ సినిమా కెరీర్ సురేష్ ఒబెరాయ్ 1977లో ‘జీవన్ ముక్త్’ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ‘కాలా పత్తర్’, సురక్ష, డ్యూటీ వంటి చిత్రాలలో సహాయ నటుడిగా పనిచేశారు. 1980లో వచ్చిన ‘ఏక్ బార్ ఫిర్’లో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. సురేష్ ఒబెరాయ్ 1987లో ‘మిర్చ్ మసాలా’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ పాత్రకు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ‘ఘర్ ఏక్ మందిర్’ చిత్రానికి గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

సురేష్ కొడుకు వివేక్ ఒబెరాయ్ సురేష్ ఒబెరాయ్ కెరీర్ ప్రారంభం కాకముందే పెళ్లి చేసుకున్నారు. అతను 1 ఆగస్టు 1974న మద్రాసులో యశోధరను వివాహం చేసుకున్నారు. అతని భార్య పంజాబీ కుటుంబం నుంచి వచ్చింది. వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారు. అతడే వివేక్ ఒబెరాయ్. అతను ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ నటుడు. కుమార్తె మేఘనా ఒబెరాయ్. పెళ్లయిన 3 సంవత్సరాల తర్వాత సురేష్ ఒబెరాయ్ సినిమాల్లో మొదటి బ్రేక్ పొందడం విశేషం.

జాన్‌ అబ్రహం హీరో కాకముందు ఏం చేసేవాడో తెలుసా..? నేడు అతనొక బాలీవుడ్‌ సూపర్ స్టార్‌..

అంపైర్‌ని చంపేస్తానని బెదిరించాడు.. కెరీర్‌ సర్వనాశనం చేసుకున్నాడు.. ఎవరో తెలుసా..?

అలసట, ఒళ్లు నొప్పులు భరించలేకపోతున్నారా..! ఈ రెండు డ్రింక్స్‌ మీకు సరైన పరిష్కారం..