Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..! కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..

Worship: సనాతన హిందూ ధర్మంలో దేవుడి పూజకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరికి ఇంట్లో పూజగది ఉంటుంది. ప్రతిరోజు ఈ గదిలో

పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..! కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..
Puja
Follow us
uppula Raju

|

Updated on: Dec 17, 2021 | 9:36 AM

Worship: సనాతన హిందూ ధర్మంలో దేవుడి పూజకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరికి ఇంట్లో పూజగది ఉంటుంది. ప్రతిరోజు ఈ గదిలో దేవుడికి పూజలు చేస్తారు. తమ కోరికలు నెరవేర్చాలని భక్తితో ఆరాధిస్తారు. అయితే భక్తులు ఒక్కో దేవుడికి ఒక్కో రకంగా పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత కూడా కొంతమంది మనసు నిత్యం కలవరపడుతూనే ఉంటుంది. ఎందుకంటే పూజ సమయంలో వీరి మనసు ఎక్కడో ఉంటుంది. అందుకే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.

1. దిశను జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఇంటి ఆలయం లేదా పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిశ దేవుని ఆలయానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే మీ ఇంట్లో పూజగది నైరుతి దిశలో ఉంటే పూజ ఫలాలు తక్కువగా అందుతాయి.

2. ఇలా కూర్చోకూడదు మీరు పూజలు చేస్తున్నప్పుడు మీ ముఖం పడమర వైపు ఉండాలి. అదేవిధంగా ఆలయం లేదా దేవుడు తూర్పు ముఖంగా ఉండాలి. అంతే కాదు దేవతా విగ్రహం ఎదుట ఎప్పుడూ వీపు కనిపించేలా కూర్చోకూడదు.

3. ఆసనాల ద్వారా కూర్చోవాలి తరచుగా ప్రజలు నేలపై కూర్చొని పూజలు ప్రారంభిస్తారు. కానీ అది సరైన మార్గం కాదు. ఎందుకంటే పూజ సమయంలో ఆసనాన్ని ఉపయోగించడం అవసరం. కూర్చొని పూజ చేస్తే దరిద్రం వస్తుందని నమ్ముతారు. అందువల్ల పూజ సమయంలో శుభ్రమైన ఆసనాలలో కూర్చోవాలి.

4. గుడిలో దీపం వెలిగించాలి ఇంట్లో ఏదైనా దేవాలయం లేదా పూజగది ఉంటే అక్కడ ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లో దీపం వెలిగిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.

5. పంచదేవుని ఆరాధన విష్ణువు, గణేశుడు, శివుడు, సూర్యుడు, దుర్గాదేవిని పంచదేవులు అంటారు. ప్రతిరోజూ పూజించేటప్పుడు, ఖచ్చితంగా ఈ పంచదేవతలను ధ్యానించాలి. ఇలా చేయడం వల్ల సుఖం, శ్రేయస్సు లభిస్తాయి. భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.

గమనిక- ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా రాశారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి రాయడం జరిగింది.

NBCC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజ్‌మెంట్ ట్రైనీతో సహా అనేక పోస్టులు ఖాళీ.. ఎలా అప్లై చేయాలంటే..?

పాకిస్తాన్‌ నుంచి వచ్చి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాడు.. అతడి కొడుకు ఇప్పుడొక సూపర్‌ స్టార్..

డార్క్ చాక్లెట్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా..! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..