Zodiac Signs: ఈ 5 రాశులవారు మాటలతో కట్టిపడేస్తారట.. అందులో మీరున్నారా.!
మనల్ని మొదటి చూపులోనే ఆకర్షించేవారు కొంతమంది ఉంటారు. వారి నవ్వు, మాటలు, అందం.. ఇలా అన్ని కూడా మనల్ని కట్టిపడేస్తాయి...
సాధారణంగా ఓ అబ్బాయికి అమ్మాయి నచ్చిందంటే చాలు.. ఆమెను ఆకర్షించడానికి అతడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే వారి దృష్టిని తన వైపుకు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడతాడు. ఇదిలా ఉంటే.. మనల్ని మొదటి చూపులోనే ఆకర్షించేవారు కొంతమంది ఉంటారు. వారి నవ్వు, మాటలు, అందం.. ఇలా అన్ని కూడా మనల్ని కట్టిపడేస్తాయి. ఎప్పుడూ వారితో ఉండాలనిపిస్తుంది. వారిని పొగడాలని.. అలాగే మాట్లాడాలని ఉంటుంది. అయితే ఇతరులను మన మాటలు, చేష్టలతో కట్టి పడేయడం అంత ఈజీ కాదు. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం.. కవ్విస్తూ, మాటకారితనంతో కట్టిపడేసేవారు కొందరు ఉన్నారట. ఈ 5 రాశులవారు ఆ కళలో ప్రావీణ్యం చెందినవారట. మరి ఆ రాశులు ఏంటో చూసేద్దాం పదండి.!
మేషరాశి:
ఈ రాశికి చెందినవారి మాటకారితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు తమ వ్యక్తిత్వం, సెన్స్ ఆఫ్ హ్యుమర్ ద్వారా ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. కవ్వించడంలో వీరు ప్రావీణులని చెప్పొచ్చు. ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు.
మిధునరాశి:
ఈ రాశివారు సామాజికంగా అందరితో కలుస్తారు. ఏ విషయాన్ని అయినా కూడా ప్రతీ ఒక్కరితో పంచుకుంటారు. వీరికి ఎవరైనా ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు.. తమకు తెలియకుండానే తమ మాటకారితనంతో కట్టిపడేస్తారు. తమదైన ముద్రను వేసుకోవడంలో వీరు ప్రావీణులు.
సింహరాశి:
ఈ రాశివారు ఎంతో ఫ్రెండ్లీగా, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారిలోని ఈ రెండో లక్షణమే.. ఎవరి పట్ల ఆకర్షితురాలైనా బాధ్యతగా వ్యవహరించడంలో సహాయపడుతుంది. సమయాన్ని వృధా చేయకుండా నచ్చినవారితో కలిసిపోవడానికి శతవిధాల ప్రయత్నిస్తారు.
వృశ్చికరాశి:
ఈ రాశివారు ఎంతో ఉద్వేగపరులు, కొంచెం మిస్టరీ పర్సన్స్ అని చెప్పొచ్చు. వారిలో ఎన్నో రహస్యాలు దాగుంటాయి. వీరి గురించి తెలుసుకోవాలని అనుకునేవారు.. వారి పట్ల ఇట్టే ఆకర్షితులవుతారు. ఇక అదే ఈ రాశివారి పనిని సులభతరం చేస్తుంది. తద్వారా తమ మాటలతో ఇతరులను ఈజీగా కట్టిపడేస్తారు.
ధనుస్సురాశి:
ఈ రాశివారు ఇతరుల పట్ల సులభంగా ఆకర్షితులవ్వరు. కానీ ఎవరైనా నచ్చి ప్రయత్నిస్తే.. తప్పనిసరిగా వారిని ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీరి చమత్కారమైన మాటలు ఎదుటవారిని ఆకట్టుకుంటాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.
Also Read:
బాత్రూమ్ గోడను రిపేర్ చేస్తోన్న ప్లంబర్‌కు ఊహించని షాక్.. బద్దలకొట్టి చూడగా ఫ్యూజులు ఔట్!
ఈ ఫొటోలో పామును గుర్తించడం అంత ఈజీ కాదండోయ్.. కనిపెట్టాలంటే స్టోరీ చదవాల్సిందే!